ఆళ్ల‌గ‌డ్డ‌లో అంతులేని అభిమానం


- జ‌న‌నేత‌కు ఆత్మీయ స్వాగ‌తం
- ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు
- రాజ‌న్న బిడ్డ‌ను చూసేందుకు ఎగ‌బ‌డ్డ జ‌నం
-  వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు వెల్లువ‌

క‌ర్నూలు జిల్లా:  ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతున్న జననేత, వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి క‌ర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్ర‌జ‌లు అంతులేని అభిమానం చూపారు. రాజ‌న్న బిడ్డ‌ను అక్కున చేర్చుకొని ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఈ నెల 6వ తేదీన ఇడుపుల పాయ‌లో ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఈ నెల 14న క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గానికి చేరింది. చాగ‌ల‌మ‌ర్రిలో మొద‌టి రోజు జ‌న‌నేత‌కు పూల‌వ‌ర్షంతో స్వాగ‌తం ప‌లికారు. పాద‌యాత్ర వంద కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో రంగురంగుల ముగ్గులు వేసి అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. రెండో రోజు ఆర్‌.కృష్ణాపురం నుంచి ప్రారంభ‌మైన యాత్ర రాత్రికి ఆళ్ల‌గ‌డ్డ ప‌ట్ట‌ణానికి చేరుకుంది. దారి పొడువునా ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌తో క‌లిసి మాట్లాడారు. అచ్చం రాజ‌న్నలాగే ఉన్నావ‌ని వైఎస్‌ జగన్‌ను కలిసిన పలువురు వృద్ధ మహిళలు తమ మనోభావాలను వెల్లడించారు.  పాదయాత్రగా వస్తున్న జగన్‌ను పలువురు కూలీలు, ఉద్యోగులు, రైతులు కలిశారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తామంతా సంతోషంగా ఉన్నామని, చంద్రబాబు సీఎం అయ్యాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వైయ‌స్‌ఆర్‌ హయాంలో రెండుకార్లు పంటలు పండించుకునేవాళ్లమని, ఇప్పుడు ఒక పంటకు కూడా నీరు అందడం లేదన్నారు. 

మీనాయనలాగే మా సమస్యలు తీర్చండి
పాద‌యాత్ర‌లో వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. పలువురు పేద మహిళలు ‘జగనన్నా..  మాకు పింఛన్‌ రావడం లేదు.. ఉండడానికి ఇళ్లు లేవు.. మీరు అధికారంలోకి వచ్చాక మీనాయనలాగే మా సమస్యలు తీర్చండి’ అని కోరారు. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ మాట్లాడుతూ ‘మీ సమస్యలు పరిష్కరించేందుకు 3 వేల కి.మీ పాదయాత్ర చేపట్టాను..మీ సమస్యలను తీర్చి మీ ఇంట్లో నాన్న ఫొటోతో పాటు నా ఫొటో కూడా పెట్టుకోవాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నా’ అని అన్నారు. వైయ‌స్ జగన్‌ పలకరింపులు, ఆప్యాయతను చూసి మహిళలు మురిసిపోయారు. తొమ్మిదవ రోజు పాదయాత్రలో వైయ‌స్‌ జగన్‌ 14.5 కిలోమీటర్లు నడిచారు. దీంతో ఇప్పటివరకు ఆయన 124.3 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లయింది.

పూల‌బాట‌..
ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా  వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆళ్లగడ్డకు చేరుకోగానే ప్రజలు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. శివార్ల నుంచి పూలబాటపై నడిపించారు. పెద్దఎత్తున బాణాసంచా పేల్చుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డలో ఎటుచూసినా జనమే కనిపించారు. ఆయన వెంట నడిచేందుకు అభిమానులు పోటీ పడ్డారు. కరచాలనాలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. తర్వాత నాలుగురోడ్ల కూడలిలో జరిగిన బహిరంగ సభ జనసంద్రమైంది. 

Back to Top