రెండో రోజు జిల్లాలో కొనసాగుతున్న జననేత పర్యటన

తూర్పుగోదావరిః వైయస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రెండో రోజు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పోలవరం నిర్వాసితులు, బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. అధైర్య పడొద్దని వైయస్సార్సీపీ అన్ని విధాల అండగా ఉంటుందని వారిలో ధైర్యం నింపుతున్నారు. వైయస్ జగన్ వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, చీర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా తదితరులున్నారు. 

Back to Top