జనవరి 4 నుంచి కర్నూలులో రైతు భరోసా యాత్ర

కర్నూలుః జనవరి 4 నుంచి కర్నూలు జిల్లాలో వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్టు శ్రీశైలం నియోజకవర్గ ఇంచార్జ్ బుడ్డా శేషారెడ్డి తెలిపారు. ఆత్మ హత్య చేసుకున్న రైతుల కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శిస్తారని తెలిపారు. 4వ తేదీ శ్రీశైలంలో భ్రమరాంబ మల్లిఖార్జునస్వామిని దర్శించుకొని వైయస్ జగన్ యాత్ర ప్రారంభిస్తారని శేషారెడ్డి వివరించారు. 5వ తేదీన ఆత్మకూరులో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. మొత్తం ఐదురోజుల పాటు వైయస్ జగన్ జిల్లాలో పర్యటిస్తారని పేర్కొన్నారు.  ప్రభుత్వం అసమర్థత కారణంగానే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని శేషారెడ్డి అన్నారు. ప్రాజెక్ట్ ల పేరుతో టీడీపీ నేతలు వందలకోట్లు దండుకొంటూ రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top