మంగళగిరి: సమరదీక్ష సాక్షిగా చంద్రబాబు మోసాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం 'రాష్ట్రానికి మోసగాడు' పుస్తకాన్ని విడుదల చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి వై జంక్షన్ వద్ద చేపట్టిన సమరదీక్ష రెండోరోజు కూడా కొనసాగుతోంది. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలను చంద్రబాబు ఎలా మోసం చేశారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారనేది 'రాష్ట్రానికి మోసగాడు' పుస్తకంలో అన్ని వివరాలు విపులంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకమని అన్నారు. టీడీపీ ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు, అమలు జరుగుతున్న తీరుతెన్నులు తదితర అంశాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయని చెవిరెడ్డి తెలిపారు.<br/>Click here to Download: చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనపై ‘రాష్ట్రానికే మోసగాడు’ పేరిట 80 పేజీల పుస్తకాన్ని విడుదల చేసిన వైఎస్సార్‌సీపీ <br/>