రెల్లి కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

వైయస్‌ జగన్‌ను కలిసిన రెల్లి కులస్తులు..
శ్రీకాకుళంః పాలకొండ నియోజకవర్గం రాజపయరం సమీపంలో  రెల్లి కులస్తులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. తమకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రెల్లి కులస్తుల అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.టీడీపీ ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదన్నారు.  కాయకష్టం చేసుకుని బిడ్డల్ని చదివించుకుంటున్నా ఉద్యోగవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రెల్లి కులస్తులపై విచారణ కమిటీ వేయిస్తే  రెల్లి కులాలు ఎంత దుర్భర స్థితిలో ఉన్నాయో తెలుస్తుందన్నారు. విద్య,ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించాలని కోరారు.  రెల్లి జాతికి తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రెల్లిలకు లోన్లు, పథకాలు కేవలం రెండు  శాతమే మాత్రమే అందుతున్నాయన్నారు.  ఎస్సీకార్పొరేషన్‌ నుంచి విడదీయాలి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని వైయస్‌ జగన్‌ను కోరినట్లు  తెలిపారు.
Back to Top