రజకులకు అండగా ఉంటా


విజయనగరం: రజకులకు అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కోటగండ్రేదు వద్ద వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని రజకులు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇస్తీ్ర చేసి వారి కష్టాన్ని తెలుసుకున్నారు. అనంతరం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నవరత్నాలతో కలిగే లబ్ధి వారికి వివరించారు. ఆయన మాట్లాడుతూ..చిన్న పిల్లలను బడికి పంపిస్తే..ఆ తల్లికి ఏటా రూ.15 వేలు చెల్లిస్తామన్నారు. పెద్ద పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు ఏటా రూ.20 వేలు చెల్లిస్తామని, మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా కల్పించారు. పింఛన్‌ రూ.2 వేలు పెంచుతామని, 45 ఏళ్లు నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వారికి ఎలాంటి మంచి జరుగడం లేదన్నారు. ఈ వయసులో వారిని ఆదుకునేందుకు వైయస్‌ఆర్‌ చేయూత కార్యక్రమం ద్వారా రూ.75 వేలు ఉచితంగా అందజేస్తామన్నారు. రజకుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 
 
Back to Top