విశాఖ: వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక లక్కబొమ్మల పరిశ్రమను ఆదుకుంటానని, తయారీదారులకు అన్ని విధాల అండగా ఉంటానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతుంది. లక్కబొమ్మలకు ప్రసిద్దిగాంచిన ఏటికొప్పాకలో లక్కబొమ్మల కళాకారులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్‌కు అభిమానంతో లక్కబొమ్మను బహుకరించారు. బొమ్మల తయారీలో లక్క, విద్యుత్‌లో సబ్సిడీ కల్పించాలని కోరారు. చాలిచాలని సంపాదనతో కుటుంబాలు గడవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. బొమ్మలకు గిట్టుబాటు ధరల కూడా లేదని, లక్కబొమ్మల తయారీ క్రర కూడా దొరకడం కష్టంగా ఉందని,ఫారెస్ట్ అధికారుల నుంచి ఇబ్బందులు ఉన్నాయని, లక్కబొమ్మల పరిశ్రమలను ఆదుకోవాలని కోరారు.