ప్రతి కులానికి ఓ కార్పొరేషన్‌..

- కార్పొరేషన్ల విధానం పూర్తి ప్రక్షాళన
-  బిసి వర్గాల్లో విప్లవం తీసుకొస్తాం
- శెట్టిబలిజలతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి
విజయనగరం: ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని, కార్పొరేషన విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి అందరికి సమన్యాయం జరిగేలా చేస్తామని వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. కరుపాం నియోజకవర్గం అల్లువాడ దగ్గర  శెట్టిజలిజలతో ముఖాముఖి కార్యక్రమంలో వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. విద్యార్థులకు పూర్తి రియింబర్స్‌మెంట్‌ ఇవ్వడమే కాకుండా ప్రతి ఏడాదికి 20 వేల రూపాయాలు ఇస్తామన్నారు. బిసి వర్గాల్లో విప్లవం తీసుకొస్తామన్నారు. కులాల జనాభాను బట్టి కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేస్తామన్నారు. చంద్రబాబులాగా హామీలిచ్చి మోసం చేయడం నాకు చేతకాదన్నారు. మాట మీద నిలబడతానన్నారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ మహిళలకు పింఛన్‌ కల్పిస్తామన్నారు.మహిళలకు నాలుగు దఫాలుగా రూ.75వేలు  అందజేస్తామన్నారు.లోన్లు రూపంలో కాకుండా ఉచితంగా సొమ్ము అందజేస్తామన్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ గ్రామానికి చెందిన యువతకే ఉద్యోగాలు  ఇస్తామన్నారు. నాన్నగారు దివంగత వైయస్‌ఆర్‌ పాలను తలపించే విధంగా  గ్రామ సచివాలయాలు ద్వారా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు.ఏ కులంలోనూ ఒకరికి కూడా మేలు జరగలేదు అని మాట రాకుండా మేలు చేస్తామన్నారు.
Back to Top