ఆదివారం ఆత్మీయ కరచాలనం

 - ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు మ‌ద్ద‌తు వెల్లువ‌
- పాద‌యాత్ర దారులు జ‌న‌సంద్రం
 నెల్లూరు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గ్రామ గ్రామాన మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. అంతులేని అభిమానం జననేతను అక్కున చేర్చుకుంటోంది. పూలతివాచీ పరిచి.. మంగళ హారతులిచ్చి గ్రామాల్లోకి ఆత్మీయంగా స్వాగతించి ఆయన వెంట వేలాది మంది అడుగులు వేస్తున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, శాసనసభ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంక ల్ప యాత్ర అశేష జనవాహిని నడుమ 73వ రోజైన ఆదివారం గూడురు నియోజకవర్గం పరిధిలోని తిమ్మ‌స‌ముద్రం క్రాస్ నుంచి ప్రారంభ‌మైంది. తెల్ల‌వార‌క‌ముందే బ‌స వ‌ద్ద‌కు వేలాది మంది త‌ర‌లివ‌చ్చి రాజ‌న్న బిడ్డ‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి వైయ‌స్ జ‌గ‌న్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి వెంట ప్రజల గోడు వింటున్నారు. అధైర్యపడవద్దని వైయ‌స్ జగన్‌ వారికి భరోసా ఇస్తున్నారు.   

కాండ్రలో పూల తివాచీ పరిచి..
గూడూరు నియోజకవర్గ పరిధిలోని కాండ్రలో నిన్న‌ పార్టీ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. వైయ‌స్‌ జగన్‌కు పూలతివాచీ పరిచారు. కేరళ వాయిద్య విన్యాసాల నడుమ స్వాగతం పలికి సర్వమత ప్రార్థనలు చేశారు. ముస్లిం పెద్దలు జననేతకు టోపీ అలంకరించారు. పలువురు మహిళలు తమ సమస్యలను వైయ‌స్ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తిమ్మసముద్రం చేరుకున్న వైయ‌స్‌ జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అందరితో ఆత్మీయ కరచాలనం చేస్తూ పాదయత్ర కొనసాగించారు.




Back to Top