రామిగానివారిపల్లె వద్ద ముగిసిన పాదయాత్ర
చిత్తూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రను 47వ రోజు పాద‌యాత్ర చిత్తూరు జి ల్లా రామిగానివారిప‌ల్లె వ‌ద్ద ముగిసింది. శ‌నివారం ఉద‌యం తంబ‌ళ్ల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని వసంతపురం నుంచి వైయ‌స్‌ జగన్ పాద‌యాత్ర ప్రారంభం కాగా  ప్రజలు బ్రహ్మారథం పట్టారు. రాజన్న బిడ్డ మన వాడకు వచ్చాడంటూ ఆయా గ్రామాల ప్రజలు జననేతకు పూలతో స్వాగతం పలుకుతూ వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం కొత్తపల్లి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో వైయ‌స్‌ జగన్‌ మొక్క నాటారు. అనంతరం కొత్తపల్లి  మీదుగా బోరెడ్డివారికోటకు చేరిన ఆయన అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు.  అనంతరం రెడ్డి బోరెడ్డివారికోట‌లో ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయిన ఆయన... స్థానికుల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు.  రైతుల‌ను అన్ని విధాల ఆదుకుంటాన‌ని వైయ‌స్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అలాగే మ‌న ప్ర‌భుత్వం రాగానే అక్కాచెల్లెమ్మ‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని, డ్వాక్రా రుణాలు నాలుగు విడ‌త‌ల్లో మాఫీ చేసి ఆ డ‌బ్బులు మీ చేతికే ఇస్తామని వైయ‌స్ జగన్‌ తెలిపారు. తంబ‌ళ్ల‌ప‌ల్లి ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు పాల‌న‌ను ఎండ‌గ‌ట్టారు. రామిగానివారిప‌ల్లె వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ముగిసింది.
Back to Top