జన జాతర




- కృష్ణా జిల్లాలో విజ‌య‌వంతంగా ప్రజా సంకల్పయాత్ర
- పోటెత్తుతున్న పాద‌యాత్ర దారులు
- జ‌న‌నేత వైయ‌స్ జగన్‌కు అడుగడుగునా ఘ‌న స్వాగతం 
కృష్ణా జిల్లా:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. గ‌తేడాది న‌వంబ‌ర్ 6న ఇడుపుల పాయ నుంచి ప్రారంభ‌మైన వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో కొన‌సాగుతోంది.  రాజ‌న్న బిడ్డ కనకదుర్గమ్మ వంతెన మీద అడుగుపెట్టగానే జన సునామీ ఉప్పొంగింది. విజయవాడతో మొదలైన జనజాతర జిల్లాలో పల్లెలు, పట్టణాల గుండా సాగుతోంది. జననేత కోసం జనం పోటెత్తుతున్నారు... ఆయన అడుగులో అడుగు వేస్తున్నారు... ఆత్మీయంగా పలకరిస్తున్నారు...తమ బిడ్డగా భావిస్తూ బాధలు చెప్పుకుంటున్నారు... వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి దారిపొడవునా అందరితో మమేకమవుతున్నారు...బాధలు తీరుస్తానని మాటిస్తున్నారు... అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారు...వేసవి తీవ్రతను లెక్కచేయకుండా...అలసటా...విసుగూ లేకుండా జనం మధ్యలోనే సేదదీరుతూ పాదయాత్ర ప్రస్థానం కొనసాగిస్తున్నారు. అధినేత నిబద్ధతతో కూడిన పోరాటం... నేతలు, కార్యకర్తల కార్యాచరణ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహాన్నిస్తోంది. 

ఈ నెల 14వ తేదీన కృష్ణా జిల్లాలో అడుగుపెట్టిన వైయ‌స్ జ‌గ‌న్ ఇప్పటికే ఐదు నియోజకవర్గాల్లో  పాదయాత్ర పూర్తి చేసి ఆరో నియోజకవర్గంలో కొనసాగిస్తున్నారు. విజయవాడలోని మూడు నియోజకవర్గాలతోపాటు మైలవరం, నూజివీడు నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తయ్యింది. గన్నవరం నియోజవర్గంలో పాదయాత్ర రెండు రోజులుగా కొనసాగుతోంది. వైయ‌స్‌ జగన్‌ 145వ రోజు పాద‌యాత్ర‌ను బుధవారం ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం దావాజీగూడెం శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ఉంగటూరు మండలం వెన్నూతల, పుట్టగుంట క్రాస్‌ రోడ్డు, వెల్దిపాడు క్రాస్‌ రోడ్డు, నాగవరప్పాడు, ఎలకపాడు క్రాస్‌ రోడ్డు, ఉంగుటూరు, ఆముదాల పల్లి క్రాస్‌ రోడ్డు, లంకపల్లిల మీదుగా వెంకట రాంపురం వరకూ పాద్రయాత్ర కొనసాగనుంది. వైయ‌స్ జగన్‌ను తమ సొంత బిడ్డ ఇంటికి వచ్చినట్లుగా మహిళలు ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు. వయోభారాన్ని కూడా లెక్కచేయకుండా అవ్వాతాతలు వైయ‌స్ జగన్‌ను కలుస్తున్నారు. యువత ఉత్సాహానికైతే అవధుల్లేవు. ప్రభుత్వం పింఛన్లు ఇవ్వడం లేదని...ఇళ్లు ఇవ్వడం లేదని... ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని... కనీస వేతనాలు చెల్లించడం లేదని... కరువు పనులు చేసుకుని కూలీ ఇవ్వలేదని... తమ భూములు ఆక్రమించుకున్నారని... జీఎస్టీతో వ్యాపారులు దెబ్బతింటున్నాయని... మట్టి, ఇసుక దోపిడీనికి పాల్పడుతున్నారని... టీడీపీనేతలు దౌర్జన్యం చేస్తున్నారని... అక్రమ కేసులు బనాయిస్తున్నారని ...ఇలా తమ సమస్యలు ఏకరవు పెడుతున్నారు.  ఎంతో నమ్మకంతో తమ బాధలు చెప్పుకుంటున్న వారి బాధలను వైయ‌స్ జగన్‌ ఓపిగ్గా వింటున్నారు. సమస్యను బట్టి పరిష్కార చర్యలు తీసుకుంటున్నారు. కొందరికి సాయం కోసం తమ సిబ్బందికి సూచిస్తున్నారు. స్థానిక సమస్యల అంశాలను పార్టీ నేతలకు బాధ్యత అప్పగిస్తున్నారు. విధానపరమై అంశాలపై తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం చేస్తానని భరోసా ఇస్తున్నారు. 

Back to Top