నవంబ‌ర్ 2 నుంచి వైయస్ జగన్ పాద‌యాత్ర‌

అనంతపురం :

 యువ‌భేరి కార్య‌క్ర‌మం నేను చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఈ బాధ్య‌త‌లు నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డీనేట‌ర్ల‌కు అప్ప‌గిస్తున్నాను. ప్ర‌తి కాలేజీ వ‌ద్ద‌కు వెళ్లి యువ‌బేరీ కార్య‌క్ర‌మాన్నివాళ్లే నిర్వ‌హిస్తార‌ని వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. పాద‌యాత్ర ద్వారా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతూ..అవ‌స‌ర‌మైతే చివ‌రి అస్త్రంగా ఎంపీల చేత రాజీనామా చేయిస్తాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. యువ‌భేరి కార్య‌క్ర‌మం గ‌తంలో ప‌రీక్ష‌లు ఉన్న స‌మ‌యంలో నిలిపివేశాం. ఈ ఆరు నెల‌ల కాలంలో ప్ర‌త్యేక హోదా గురించి ఏవ‌రైనా మాట్లాడారా? జ‌గ‌న్ మాట్లాడితేనే ప్ర‌త్యేక హోదా. లేదంటే ప్ర‌త్యేక హోదా అంశం లేదు. ఈ ప‌రిస్థితి మారాలి. ఒత్తిడి పెర‌గాలి. హోదా రావాలంటే అంద‌రి తోడ్పాటు, స‌హాయ స‌హ‌కారాలు అవ‌స‌ర‌మ‌న్నారు. ప్ర‌త్యేక హోదా అన్న అంశం ఎవ‌రూ కూడా మ‌రిచి పోకూడ‌ద‌ని చెప్పారు. హోదా వ‌స్తే ఉద్యోగాల కోసం మ‌నం ఎక్క‌డికి పోవాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న జిల్లాలోనే ఉద్యోగాలు వ‌స్తాయ‌ని చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top