వైయ‌స్‌ జగన్‌ను సీఎం చేయటమే లక్ష్యం



 నెల్లూరు: ఆంధ్ర‌రాష్ట్రానికి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాల్సిన అవసరం, అవశ్యం ఉందని దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. 2019లో వైయ‌స్ జ‌గ‌న్‌ను సీఎం చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధి వైయ‌స్ జగన్‌ పాలనతోనే సాధ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో తమ కుటుంబానికి పాతకాలం నుంచి మంచి స్నేహం ఉందని చెప్పారు. నేదురుమల్లి అనుచరులు, అభిమానులు అందరితో చర్చించిన తర్వాత వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

ఇప్పటికే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్రలో కలిసి అన్ని అంశాలపై మాట్లాడానని వివరించారు. తాను గత మూడేళ్లుగా బీజేపీలో కొనసాగానని, ఇప్పుడు బీజేపీలోని పదవులకు రాజీనామా చేసి వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తున్నానని చెప్పారు. కొద్ది రోజుల క్రితం పాదయాత్రలో వైయ‌స్ జగన్‌ను కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరతానని ప్రకటించారు. ప్రధానంగా తన తండ్రి మాజీ ముఖ్యమంత్రినేదురుమల్లి జనార్దన్‌రెడ్డి జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని నిరంతరం పరితపించారని, ఆయన ఆశయసాధనే ధ్యేయంగా పనిచేస్తామని వివరించారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా తమకు మిత్రుడే అన్నారు.

 రాష్ట్రాన్ని అని విధాలా ముందుకు తీసుకుని పోవాలంటే వైయ‌స్ జగన్‌ ఒక్కరే సమర్దుడని ఐదు కోట్ల మంది ప్రజ లు భావిస్తున్నారని తెలిపారు. 2019లో వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక జిల్లా రూపురేఖలు మారిపోవటం ఖాయమని, అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని వివరించారు.
 

 
 
Back to Top