–వైయస్‌ఆర్ హయాంలో తోటపల్లి పనులు పరుగులు పెట్టాయి.–వైయస్‌ఆర్ హయాంలోనే కురుపాం అభివృద్ధి..–.ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు..–పంట మొత్తం దళారీ పాలయ్యాక..కొనుగోలు కేంద్రాలను తెరుస్తున్నారు..–దళారులను చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారు..–రేషన్ బియ్యం కోసం గిరిజనులు ఇక్కట్లు పడుతున్నారు.–చేసింది గోరంత..ప్రచారం కొండంత..–తుపాను బాధితులున ఆదుకున్నట్లు చంద్రబాబు విస్తృత ప్రచారం..–ఇంత నష్టం జరిగితే చంద్రబాబు రూ.520 కోట్లు కూడా ఇవ్వలేదు..–రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా..చంద్రబాబు ఉండరు..–ఒక రోజు కర్ణాటకలో ఉంటారు..మరో రోజు కోల్‌కతాలో ఉంటారు..–రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో 470 మండలాల్లో కరువు.–ఇప్పుడు 470 మండలాలు కాస్తా..520కు పెరిగాయి.–కనీసం ఒక్క రూపాయి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు..–ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు యాగీ చేస్తారు..–ఆపరేషన్ గరుడపై విచారణ చేయమని రాష్ట్రపతిని ఎందుకు కోరరు..?–కనీసం కోర్టులో కూడా పిటిషన్ వేయరు..–ఎందుకంటే విచారణ చేస్తే చంద్రబాబే దొంగని తేలుతుంది కాబట్టి...–రాష్ట్ర సమస్యలు పట్టవు..జాతీయ సమస్యలు కావాలట..–రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తోంది.–గుడి భూములూ,బడి భూములూ దోచేస్తున్నారు..- వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే అక్కచెల్లెమ్మలకు ఎన్నికల తేదీ నాటికి ఉన్న అప్పలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం..–వడ్డీలేని రుణాలు అందిస్తాం..–చిన్నారులను బడికి పంపే తల్లులకు ఏటా రూ.15వేలు ఆర్థికసాయం.–చదువుల విప్లవం తీసుకొస్తాం..

విజయనగరం: చంద్రబాబు ఈ మధ్య రోజుకో యాగీ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఈయనకు రాష్ట్ర సమస్యలు కనిపించడం లేదని, జాతీయ సమస్యలు పరిష్కరిస్తారట, అంతరిక్షంలోని సమస్యలు కూడా పరిష్కరిస్తారని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో అవినీతి, అన్యాయం, అరాచకాలు, అబద్ధాలు, మోసాలు చూశామని పేర్కొన్నారు. ఇలాంటి పాలన పోవాలని, మళ్లీ రాజన్న రాజ్యం తెస్తానని, మహానేత స్ఫూర్తితో అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటానని, నవరాత్నాలతో అన్ని వర్గాలకు మంచి చేస్తానని మాట ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కురుపాం నియోజకవర్గంలోని నిర్వహించిన బహిరంగ సభలో వైయస్ జగన్ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్ జగన్ మాటల్లోనే..

– విజయనగరం జి ల్లాలో పాదయాత్ర చివరి అంకానికి చేరింది. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారన్నది దారి పొడవునా చెప్పుకొస్తున్న విషయం. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్న చరిత్రను కూడా ఈ రాష్ట్రంలో చూశాం. ఇక్కడి నుంచి గెలిచిన మీ ఎమ్మెల్యే, నా చెల్లి శ్రీవాణి ఇక్కడే ఉండటం చాలా ఆనందంగా ఉంది. నిజంగా పరీక్షిత్‌ను, శ్రీవాణిని ప్రలోభపెట్టని రోజు లేదు. ప్రలోభాలు ఎన్ని వచ్చినా కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. వీరిద్దరికి నా మనసులో స్థానం ఉంటుందని అక్షరాల చెబుతున్నాను.– ఇక్కడి ప్రజలు నాతో అంటున్న మాటలు..అన్నా ..నాన్నగారు అక్షరాల 25 వేల ఇల్లులు కట్టించారని చెప్పుకొస్తూ..ఈ రోజు చంద్రబాబు పాలనలో కనీసం ఊరికి ఐదారు ఇల్లులు కూడా కట్టించలేదని నక్కకు నాగలోకానికి తేడా చూపిస్తుంటే చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి.–ఈ ఏడాది వర్షభావం కారణంగా దిగుబడులు సరిగ్గా రాలేక బాధపడుతుంటే..మరో వైపు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1550 అంటున్నారు. మా వద్ద దళారీలు రూ.1050కి క్వింటాల్ చొప్పున కొంటున్నారు. ఏ రకంగా బాగుపడుతామన్నా అంటున్నారు. దళారీలు కొన్న తరువాత చంద్రబాబు కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నారు. ఇలా చేస్తే దళారీలకు మేలు జరుగుతుంది అంటున్నారు. చంద్రబాబే దళారీలను ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబుకు హెరిటేజ్ షాపులు ఉన్నాయి. మన రాష్ట్రంతో పాటు చుట్టు ప్రక్కల రాష్ట్రాల్లో హెరిటేజ్ షాపులు ఉన్నాయి. మన వద్ద కొన్న ధాన్యాన్ని ప్యాకింగ్ చేసి మూడు రేట్లకు అమ్ముకుంటున్నారు. దళారీలకు తానే నాయకత్వం వహిస్తుంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పాలన ఉంటుందా?– ఇదే నియోజకవర్గంలో ఆశ్చర్యకరమైన పరిస్థితి చూశాం. రైతు రెడ్డి రామలక్ష్మీ అనే మహిళా, జీఎన్‌ఏ వలస మండలానికి చెందిన ఆమె ..అన్నా రైతులకు ఉచిత విద్యుత్ అన్నారు..అయితే నాకు నెల నెల రూ.350 కరెంటు బిల్లులు ఇచ్చారన్నా అని చెప్పారు. బడే నాయుడు అనే రైతుకు ఏకంగా రూ.1950 బిల్లులు ఇచ్చారు. ఏదో ఒక కారణం చెప్పి, వేరు వేరు పేర్లు చెప్పి కనీసం నెలకు రూ.500 గుంజుతున్నారు.– ఆరోజు నాన్నగారు ముఖ్యమంత్రి కాగానే రైతులకు ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. ఆ రోజు చంద్రబాబు వెకిలినవ్వులు నవ్వారు. ఈ తీగల మీద బట్టలు వేసుకునేందుకు సరిపోతాయని అవహేళన చేశారు. అలాంటి పరిస్థితిని సాధ్యం చేసి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు.పగటి పూట కరెంటు లేదు. ఉచిత విద్యుత్ లేదు. రైతుల నుంచి బలవంతంగా బిల్లులు వసూలు చేస్తున్నారు.– తోటపల్లి ప్రాజెక్టు గురించి ఇక్కడి రైతులు మాట్లాడుతూ..తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు గుర్తుకు రాలేదు..ఎన్నికలకు మూడు నెలలకు ముందు మాత్రం టెంకాయ కొట్టారని చెప్పారు. ఆ తరువాత వైయస్‌ఆర్ సీఎం అయి ఈ ప్రాజెక్టును పరుగులు తీయించారు. నాన్నగారి పాలనలో 90 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన ఆ పది శాతం పనులు పూర్తి చేయడం లేదు. ఇదే నియోజకవర్గంలోని జీఎన్‌ఏ వలస, గరుకుబిల్లు మండలాల్లో 23 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వలు ఆధునీకరించకపోవడంతో కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుందని చెబుతున్నారు.– బాసంగి పల్లె వద్ద లిప్టు పెడితే 20 గ్రామాలకు నీరు అందుతుంది. తోటపల్లి ప్రాజెక్టు పక్కను ఉన్న మా గ్రామాల్లో వ్యవసాయం చేయడం లేదని రైతులు చెబుతున్నారు. వారి గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒట్టిగడ్డ రిజర్వాయర్ ద్వారా 17 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కాల్వల్లో పూడిక తీయడం లేదు. రైతులు కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదు.– పక్కనే ఝంజావతి ప్రాజెక్టు విషయంలో ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడితే నీరు వస్తుంది. అయినా పట్టించుకోవడం లేదు. ఈ ప్రాజెక్టుకు రబ్బర్ డ్యాంను వైయస్‌ఆర్ నిర్మించి ఏడు వేల ఎకరాలకు నీరు ఇచ్చారు.– ఇదే నియోజకవర్గంలోని నాగవలి నదిపై పూర్ణపాడు వంతెన ఎప్పుడు పూర్తి అవుతుందని ఊరి వారంతా వచ్చి అడుగుతున్నారు. చిన్న వంతెన కట్టలేని అధ్వాన్న పాలన సాగుతోంది.– ఇదే నియోజకవర్గంలోని సామాజిక ఆసుపత్రులు మూడు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఆసుపత్రులను బాగా చూసుకోవాలని ఆరాటపడుతాయి. కానీ ఈ ఆసుపత్రుల్లో ఒక్కొక్క చోట డాక్టర్లు 8 మంది ఉండాలి, కేవలం 6 మంది మాత్రమే పని చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఇంటర్‌నెట్ కనెక్షన్ల కారణంగా రేషన్ కోసం కాలినడకన రావాల్సి వస్తోంది. బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయమని ప్రజలు ఆందోళన చేపట్టినా పట్టించుకోవడం లేదు. బియ్యం ఎలా మిగిలించుకోవాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇంతకన్న దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?– మొన్ననే తిత్లీ తుపాన్ వచ్చింది. పంటలు, ఆస్తులు దెబ్బతిన్నాయి. ఈ ప్రభుత్వం పరిహారం అరకొరగా కొందరికే ఇచ్చారు. మీ తరఫున చంద్రబాబును అడుగుతున్నాను. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కేంద్రానికి ఓ లేఖ రాశారు. రూ.3435 కోట్లు నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు ఇందులో ఎంత డబ్బు విడుదల చేశావని అడుగుతున్నాను. కేవలం రూ.520 కోట్లు మాత్రమే ఇచ్చారట. కనీసం 15 శాతం కూడా డబ్బులు ఇవ్వలేదు. ఏ బస్సు మీద చూసినా ఈయన ఫోటోనే..తిత్లీ బాధితులను విఫరీతంగా ఆదుకున్నారట. పూర్తిగా ఆదుకున్నానని ప్రచారం చేసుకుంటున్నాడు. ఈయన కంటే దౌర్భాగ్యుడు ఉంటాడా?– నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన పూర్తి అయ్యింది. ఇన్నాళ్లు బీజేపీతో సంసారం చేశారు. రాష్ట్రానికి ఒక్క మంచి కూడా చేయించుకోలేకపోయాడు. రాష్ట్రంలో అబద్దాలు చెప్పాడు, అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ప్రజలను మభ్యపెట్టేందుకు రోజుకో డ్రామా ఆడుతున్నారు. రాష్ట్రంలో సమస్యలు ఉంటే చంద్రబాబు ఒక రోజు కర్నాటకలో కుమారస్వామితో ఉంటారు. మరో రోజు మమతా బెనర్జీతో టీ తాగుతుంటాడు. అయ్యా చంద్రబాబు..ఈ సంవత్సరంలో ఖరీఫ్‌లో వర్షపాతం రాయలసీమలో సగం వర్షం కూడా పడలేదు. మైనస్ 50 లోటు వర్షపాతం పడింది. రాయలసీమలో పంట పొలాల్లోకి అడుగుపెట్టడు. పక్కన ఉన్న రాష్ట్రానికి వెళ్లి రాజకీయాలు చేస్తాడు. ఈ పెద్ద మనిషి సొంత జిల్లా చిత్తూరులో వర్షపాతం జూన్ 1 నుంచి నవంబర్ 14కు మైనస్ 47.3 లోటు వర్షపాతం ఉంది. దాన్ని వదిలి చిత్తూరు పక్కను ఉన్న తమిళనాడుకు వెళ్తాడు స్టాలీన్‌తో సాంబార్ ఇడ్లీ తిని రెండు ఫోటోలకు ఫోజు కొడతారు. జాతీయ రాజకీయాలను ఏలేద్దామంటారు. పక్కనే నెల్లూరు జిల్లా ఉంది..మైనస్ 62.4 లోటు వర్షపాతం, ప్రకాశంలో మైనస్ 58 లోటు వర్షపాతం ఉంటే..బంగాళఖాతం సముద్రం దాటి ప్రత్యేక విమానంలో బెంగాల్ రాష్ట్రానికి వెళ్లి టిఫిన్ చేస్తారు. ఆవిడాకు శాలువాలు కప్పి సన్మానాలు చేస్తారు. మన ం దేశానికి వేలుదామని చెబుతారు. సచివాలయం పక్కను ఉన్న గుంటూరు, విజయవాడలో కూడా మైనస్ వర్షపాతం ఉంది. 470 మండలాలు కరువు మండలాలు 530 మండలాలకు ఎగబాకాయి. విజయనగరంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రబీ సీజన్‌లో ఇప్పటికే 500 మండలాలు కరువుతో అల్లాడుతున్నాయి. – ఆపరేషన్ గరుడ అని చంద్రబాబు యాగీ చేస్తున్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెద్ద కుట్ర జరుగబోతుందని, దాన్ని ఢిల్లీ పెద్దలు నడిపిస్తున్నారని విఫరీతంగా చెప్పుకుంటున్నారు. ఆపరేషన్ గరుడపై ఢిల్లీలో ఎందుకు విచారణ కోరలేదని అడుగుతున్నాను. సుప్రీం కోర్టులో ఎందుకు కేసు వేయలేదని అడుగుతున్నాను. ఈయన కేసులు వేయడు. విచారణ చేయమని రాష్ట్రపతిని కోరడు. విచారణ చేస్తే చంద్రబాబే దొంగ అని బయటకు వస్తుంది కాబట్టి అలా చేయరు.– చంద్రబాబు ఈ మధ్య కాలంలో అంటున్న మాటలు ఏంటీ..ఇన్‌కాం ట్యాక్సీలు, ఈడీ సోదాలు జరుగకూడదని కోర్టుకు వెళ్తారట. అయ్యా చంద్రబాబు..నీవు ప్రత్యేక హోదా కోసం, ఏపీ సమస్యల కోసం ఏరోజు సుప్రీం కోర్టుకు వెళ్లలేదు కానీ..నీ వాళ్ల మీద ఐటీ దాడులు జరుగకుండా ఆరాటపడుతున్నావు. నీ దొంగతనాలు, దోపిడీ, అరాచకాలపై విచారణ చేయమని హైకోర్టు ఆర్డర్లు ఇస్తే మన రాష్ట్రానికి హైకోర్టు అక్కర్లేదు అంటారు. ఏపీ వ్యవహరాలు సుప్రీం కోర్టు పరిధిలోకి రావని ఏకంగా జీవోలు కూడా ఇస్తారు. సీబీఐ అంటూ నానా యాగీ చేస్తున్నారు. మోడీపై ఒంటికాలిపై యాగీ చేస్తున్నారు. రాష్ట్ర సమస్యలు ఈయన పట్టించుకోడు. జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్ష సమస్యలు కావాలట. ప్రజలు ఎటు పోతున్నా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు.– రాష్ట్రంలో చంద్రబాబు పాలన చూడమని అడుగుతున్నాను. ఏదైనా ముఖ్యమంత్రి అంటే ఫలాన మంచి పని చేశానని ఓట్లు అడుగుతారు. కానీ చంద్రబాబు ఇవాళ అన్యాయమైన పాలన, మోసం, అబద్ధాలు, అవినీతి పాలన చేస్తున్నారు. ఇటువంటి అన్యాయమైన పాలనలో ప్రజలను మైమరిపించేందుకు ఇవాళ జాతీయ సమస్యలపై పోరాటం అంటున్నారు. – రాష్ట్రంలో రైతులు, అక్కచెల్లెమ్మలకు రుణాల మాఫీ లేదు. చంద్రబాబు చేసిన మోసానికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్కచెల్లెమ్మలు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. పావలా వడ్డీలు కనుమరుగు అయ్యాయి. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. పోలవరం పునాది గోడలు దాటి ముందుకు రావడం లేదు, ఇసుక, మట్టి, కాంట్రాక్టర్లు, బొగ్గు, కరెంటు కొనుగోలు, గుడి, బడి భూములు వదలకుండా దోచేస్తున్నారు.– ఇవాళ రాష్ట్రంలో కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజీలు, ఆర్టీసీ బస్సులు చార్జీలు బాదుడే బాదుడు. పండుగ వస్తే కొత్త సినిమా టికెట్లు అమ్ముకున్నట్లు బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఇంటి పన్నులు, స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు. పేదవాడికి మేలు చేసే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వైయస్‌ఆర్ కలలు కన్నారు. ఈ పథకానికి పాతర వేశారు. పిల్లలను చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం పడకేసింది. 108 వాహనం వస్తుందో రాదో తెలియడం లేదు. రేషన్‌షాపుల్లో బియ్యం తప్ప మరొకటి ఇవ్వడం లేదు. గతంలో బియ్యంతో పాటు చెక్కెర, కందిపప్పు, పామాయిల్, గోదుమ పిండి, కారం ఇచ్చేవారు. ఈ రోజు పరిస్థితి చూస్తే రేషన్ షాపుల్లో బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. ఇంట్లో ఆరు మంది ఉంటే కనీసం ఇద్దరికైనా వేలిముద్రలు పడటం లేదని కోత పెడుతున్నారు. చంద్రబాబు పాలనలో ఇళ్లు ఇవ్వరు. ఇంటి స్థలాలు ఇవ్వడం లేదు. పింఛన్లు కావాలన్నా..రేషన్‌కార్డు కావాలన్నా లంచాలే..చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే.. గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను తయారు చేశారు. – చంద్రబాబు పాలనలో గ్రామ గ్రామాన తాగడానికి తాను ఇస్తానన్న మినరల్ వాటర్ ప్లాంట్లు కనిపించడం లేదు. గ్రామాల్లో వీధి విధీలో మద్యం షాపులు కనిపిస్తున్నాయి. ఆగ్రిగోల్డు బాధితుల పరిస్థితి అరణ్యరోదన. చంద్రబాబు ఆగ్రిగోల్డు ఆస్తులు ఎలా కొట్టేయాలని దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. ఆగ్రిగోల్డు ఆస్తులు కొట్టేయాలని చూస్తుంటే ఈయన శవాల మీద చిల్లర వేరుకునే రకంగా కనిపిస్తున్నారు.– నాలుగున్నరేళ్ల పాలన పూర్తి అయ్యింది. మార్చిలో ఎన్నికల షెడ్యుల్ వస్తుంది. ఒ క్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. మీకు ఎలాంటి నాయకుడు కావాలి. అబద్ధాలు చెప్పే వారు మీకు నాయకుడు కావాలా? మోసం చేసేవారు నాయకుడిగా కావాలా? ఇలాంటి పాలన పోయి రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది చెబుతున్నాను. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. రాజకీయ నాయకుడు ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడాలి. మాట నిలబెట్టుకోలేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది. – రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి, మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడవారి కోసం మనం ఏం చేస్తామన్నది చెబుతున్నాను. ఇంట్లో అక్కచెల్లెమ్మలు కన్నీరు పెట్టకూడదని నాన్నగారు అంటుండేవారు. ఇవాళ రాష్ట్రంలో కన్నీరు పెట్టని అక్కచెల్లెమ్మలు లేరు. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయాలని, వారు సంతోషంగా ఉండాలని అంటుండేవారు. ఆయన మాటలు స్ఫూర్తిగా తీసుకొని అక్కచెల్లెమ్మలకు మాట ఇస్తున్నాను. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు బ్యాంకు రుణాలు మాఫీ కాలేదు. చంద్రబాబు మాటలు విన్న అక్కచెల్లెమ్మలు బ్యాంకు రుణాలు చెల్లించకపోవడంతో అక్కచెల్లెమ్మలు బ్యాంకు గడప తొక్కడం లేదు. రుణమాఫి చేయకపోవడమే కాకుండా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదు. వడ్డీ లేని రుణాలు లేవు. వడ్డీల మీద వడ్డీలతో చక్రవడ్డీలు వసూలు చేస్తూ కోర్టు మెట్లు ఎక్కిస్తున్నారు. మోసం చేసింది చంద్రబాబు అయితే..కోర్టు మెట్లు ఎక్కేది అక్కచెల్లెమ్మలు. ఎన్నికల నాటికి ఎంతైతే పొదుపు రుణాలు ఉన్నాయో ఆ మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇస్తాం. అక్కచెల్లెమ్మలు తమ కాళ్లపై నిలబడేలా వారికి వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం. –చెల్లెమ్మలు, అక్కల బాగోగుల కోసం చెబుతున్నాను. చిన్న పిల్లలను బడికి పంపిస్తే ప్రతి చెల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ఆ పిల్లలను ఏ బడికి పంపిస్తే చాలు ప్రతి ఏటా డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటాను. – కాలేజీకి వెళ్లే పిల్లలకు చెబుతున్నాను. ఇంజినీరింగ్, డాక్టరు చదువులు చదవాలన్నా ఇబ్బందులే. ఏటా లక్షల్లో ఫీజులు ఉన్నాయి. చంద్రబాబు ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నాడు. నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు కోసం రూ.3 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉన్న ఆస్తులు అమ్ముకున్నా చదివించలేకపోతున్నారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ పిల్లలను నేను చదివిస్తాను. వారు ఏం చదివినా హాస్టల్ ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు చెల్లిస్తాను. – 45 ఏళ్ల వయసులో ఉన్న అక్కలకు చెబుతున్నాను. ఒకవైపు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు పనులకు వెళ్తే కానీ బతకలేని పరిస్థితి..కళ్లారా చూశాను. వీరందరికి తోడుగా ఉండేందుకు వైయస్‌ఆర్ చేయూత పథకం తీసుకువస్తాను. మన కార్పొరేషన్ వ్యవస్థ అధ్వాన్నంగా ఉంది. ఊర్లో వెయ్యి మంది ఉంటే ప్రభుత్వం ఐదుగురికి కూడా రుణాలు ఇవ్వడం లేదు. బ్యాంకుల వారు లోన్లు ఇవ్వరూ..ఇచ్చే సబ్సిడీ సొమ్ము అరకొరగా ఉంది. లంచాలు ఇవ్వనిదే లోన్లు ఇవ్వని పరిస్థితి. మీ అందరికి హామీ ఇస్తున్నాను. వైయస్‌ఆర్ చేయూత పథకాన్ని తీసుకువచ్చి కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం. ప్రతి ఇంటిలో 45 ఏళ్లు నిండిన అక్కలను గుర్తించి ప్రతి ఒక్కరికి రూ.75 వేలు అందజేస్తాం. నాలుగేళ్లలో ఈ డబ్బులు ఇచ్చి చేయ్యి పట్టుకుని నడిపిస్తాం. ప్రతి అక్కకు తోడుగా ఉంటాం.– ప్రతి గ్రామంలోనూ ఉద్యోగాలు ఇస్తాం. గ్రామ సెక్రటెరెట్లు ఏర్పాటు చేస్తాం. మీ గ్రామంలోనే పది మందికి ఉద్యోగం ఇచ్చి..మీకు ఏ పథకం కావాలన్నా దరఖాస్తు పెట్టిన 72 గంటల్లోనే మంజూరు చేయిస్తాం. ఎవరికి లంచాలు ఇ వ్వాల్సిన పని లేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏ రెకమెండేషన్ లేకుండా పని చేయిస్తాం. గ్రామ సెక్రటరీయట్ ద్వారా అర్హులను గుర్తించి 45 ఏళ్లు నిండిన ప్రతి అక్కకు వైయస్‌ఆర్ చేయూత పథకం అందేలా చూస్తాం. ఇచ్చే ఈ సొమ్మును ఉచితంగా అక్కల చేతుల్లో పెడతామని మాట ఇస్తున్నాను.– 60 ఏళ్లు నిండిన ప్రతి తల్లికి చెబుతున్నాను. ఇవాళ అందరికి పింఛన్ ఇవ్వడం లేదు. అది కూడా వెయ్యి రూపాయలే ఇస్తున్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక పింఛన్ రూ.2 వేలు చేస్తాం. ప్రతి అవ్వకు, తాతకు తోడుగా ఉంటానని చెబుతున్నాను.– మనసున్న నాయకుడుంటే పేదలందరికీ పక్కా ఇల్లు కట్టిస్తారని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని చూశాం. 45 లక్షల ఇల్లు కట్టించారు. అలాంటి పాలన మళ్లీ తెస్తాను. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తానని అక్షరాలు చెబుతున్నాను. మన 13 జిల్లాల్లో నాన్నగారి కంటే లక్ష ఇల్లులు అంటే 25 లక్షల ఇల్లు కట్టించి ఇస్తాం. ఆ ఇల్లు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిష్ట్రేషన్ చేయిస్తాం. రేపు పొద్దున అక్కచెల్లెమ్మలకు డబ్బుతో అవసరం వచ్చినప్పుడు నేరుగా బ్యాంకుకు వెళ్లి ఆ ఇంటి పత్రాలు పెడితే పావలా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం.– నా మనసుకు ఎంతో నచ్చిన పని. ఇవాళ 2019లో ఎన్నికలు జరుగుతాయి. మళ్లీ 2024లో ఎన్నికలు జరుగుతాయి. 2019 మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ 2024 నాటికి మందు షాపులు లేకుండా చేసి ఓట్లు అడుగుతానని అక్క చెల్లెమ్మలకు నేను చేయబోయే మంచి పని అని గొప్పగా చెబుతున్నాను. – చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చేందుకు పాదయాత్రగా బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని పేరు పేరున కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా..