నిలబడలేని స్థితిలో జగన్మోహన్‌రెడ్డి

హైదరాబాద్, 31 ఆగస్టు 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి శనివారం ఉదయానికి తీవ్రంగా విషమించింది. శ్రీ జగన్ ఆరోగ్య పరిస్థితిపై ని‌మ్సు వైద్యులు శనివారం ఉదయం హెల్తు బు‌లెటిన్ విడుదల చేశారు. నిమ్సు వైద్యుడు డాక్టర్ నగే‌ష్ మాట్లాడుతూ‌... దీక్ష విరమించేందుకు శ్రీ జగన్ అంగీకరించటం లేదని, ఆయన నిలబడితే కిందపడిపోయే పరిస్థితి ఉందని అన్నారు.‌ శ్రీ జగన్కు వెంటనే ప్లూయి‌డ్సు ఎక్కించాలని డాక్టర్ నగే‌ష్ తెలిపారు.

వైద్యానికి‌ శ్రీ జగన్ సహకరించటం లేదని‌ నిమ్సు వైద్యులు వెల్లడించారు. ఆయన శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతోందని, బిపి, పల్సు, షుగర్ ‌స్థాయిలు తగ్గిపోయినట్లు చెప్పారు. కీటోన్సు 4+కు చేరుకున్నాయన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రమే వెల్లడించిన వైద్యులు.. బిపి, షుగర్, పల్సు రేట్ తదితర అంశాలపై వివరాలను వెల్లడించలేదు. డాక్ట‌ర్ శేషగిరిరావు నేతృత్వంలో ఏడుగురు వైద్య బృందం‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డికి పరీక్షలు నిర్వహించారు.

కాగా, శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు మరోసారి‌ నిమ్సు వైద్యులు శ్రీ జగన్ ఆరోగ్యంపై హె‌ల్తు బులెటిన్ విడుదల చేయనున్నారు. సమన్యాయం చేయాలంటూ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష శనివారానికి ఏడవ రోజుకు చేరింది. నిమ్సులో కూడా ఆయన నిరశన దీక్షను కొనసాగిస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top