<br/>విశాఖః వైయస్ జగన్‌పై హత్యాయత్నం ఘటన కేసులో సిట్ ఇచ్చిన 160 నోటిసుకు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. కేసు కోర్టు విచారణలో ఉందని లేఖలో పేర్కొన్నారు. రిట్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్పందిస్తానని తెలిపారు. వైయస్ జగన్‌పై గత నెల 25న విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో వైయస్ జగన్ త్రుటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకోగా చేతికి తీవ్రగాయమైంది. దీంతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో ఆయనకు శస్త్ర చికిత్సలు నిర్వహించిన విషయం విధితమే. ఆ తరువాత గత నెలలో దాడి ఘటనపై వైయస్ జగన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన హైకోర్టు ఏపి సిఎం చంద్రబాబుతో సహా 8 మంది ప్రతివాదులకు హైకోర్టు నోటిసులు జారీ చేసింది. హైదరాబాద్ సీఐఎస్‌ఎఫ్ అధికారికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారల్లో దర్యాప్తు నివేదికను ఇవ్వలని హైకోర్టు సిట్‌ను ఆదేశించింది.విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని సిట్‌ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.