ములాయంసింగ్ తో వైయస్ జగన్ భేటీ

ఢిల్లీః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ బృందం ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్ తో భేటీ అయ్యారు. ఏపీలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని ములాయం దృష్టికి తీసుకెళ్లారు. వైయస్సార్సీపీ సింబల్ పై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలతో లాక్కోవడమే గాకుండా ఏకంగా వారితో రాజీనామా చేయించకుండా చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న వైయస్సార్సీపి జాతీయస్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగడుతుంది.

Back to Top