వైఎస్ జగన్ దీక్షకు వేళాయే..!

జనం తరుపున జననేత ఉద్యమం..!
ప్రత్యేకహోదా కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష..!

హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించడం కోసం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరహార దీక్షకు సర్వం సన్నద్ధమయ్యింది.  మరికొన్ని గంటల్లో దీక్ష ప్రారంభం కానుంది. రేపు ఉందయం 9 గంటలకు వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలుకుతారు. 

అమ్మ దీవెన..!
అక్కడి నుంచి నేరుగా  ఇలవేల్పు కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకుంటారు. పాలకుల కళ్లు తెరిపించాలని, రాష్ట్రానికి మేలు చేయాలని అమ్మవారిని దర్శించుకొని కోరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి గుంటూరు నల్లపాడు రోడ్డుకు చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి ప్రియతమ నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం దీక్షను ప్రారంభిస్తారు. 

జననేతకు తోడుగా జనం ...!
వైఎస్ జగన్ వెంట వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉంటారు. వీరితో పాటు వైఎస్ జగన్ కు సంఘీభావంగా విద్యార్థులు, యువత సహా అన్నివర్గాల ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున కదం తొక్కనున్నారు. ఈనేపథ్యంలో దీక్షా ప్రాంగణం వద్ద ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్షా స్థలి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. వివిధ జిల్లాల నుంచి కళాకారులు తరలివచ్చి వైఎస్ జగన్ నాయకత్వంలో ...రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎంతమేర అవసరమన్నది తమ ఆటపాట ద్వారా తెలిపే అవకాశం కనిపిస్తోంది.
Back to Top