ద‌మ్మున్న నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్

స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏపీ హక్కులను ఢిల్లీలో తాకట్టుపెట్టారని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌ సాధిస్తామని చెప్పి నట్టేట ముంచారని మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన చంద్రబాబు రైల్వేజోన్‌ సాధించడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. విశాలమైన సముద్రతీరం ఉన్న ఉత్తరాంధ్రకు రైల్వేజోన్‌ ఇస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందనే కుట్రతోనే ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక జోన్, ప్యాకేజీ తెస్తాం.. పరిశ్రమలు తెస్తామని ఇక్కడ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు, ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలో మాత్రం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే దమ్మున్న నాయకుడు కావాలని, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల హక్కులను కాలరాసే నేతలను నమ్మొద్దన్నారు. మాట మీద నిలబడే నాయకులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనని, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటే ఏపీ అభివృద్ధి బాటలో నడుస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ను ప్రజలంతా ఆదరించి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. 

Back to Top