తూర్పు గోదావరి: సాయంత్రం 4 గంటలకు విష జ్వరాల బారినపడి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన ప్రజలను వైయస్ జగన్ పరామర్శించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా గరగప్రరులో సాంఘీక బహిష్కరణకు గురైన దళితులను పరామర్శించిన అనంతరం తాడేపల్లిగూడెం, రావులపాలెం మీదుగా వైయస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాకు బయల్దేరతారు. విష జ్వరాలు, అంతు చిక్కని వ్యాధులతో మన్యం ప్రజలు అల్లాడుతున్న సంగతి తెలిసిందే.