నెల్లూరు కు వైఎస్ జగన్

హైదరాబాద్) ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం విమానంలో బయలుదేరి, రేణిగుంట విమానాశ్రయానికి చేరతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరుకి వెళతారు. అక్కడ సీనియర్ నాయకులు ఆనం విజయ్ కుమార్ రెడ్డిని లాంఛనంగా వైఎస్సార్సీపీలోకి స్వాగతిస్తారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆయన మాట్లాడతారు. పార్టీ శ్రేణులకు వైెఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. 
Back to Top