ప్ర‌త్యేక హోదాకు చంద్ర‌బాబే అడ్డు



ప‌శ్చిమ గోదావ‌రి:  పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు కాకపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబేనని వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష  నాయ‌కులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా సోమ‌వారం విద్యార్థులు, యువ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి ప్ర‌త్యేక హోదా కోసం చేస్తున్న ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు దాన్నుంచి బైటపడడం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని ఫణంగా పెట్టారని  విమర్శించారు.  విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాతోనే సాంత్వన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. 

పార్లమెంటు సాక్షిగా ఆనాడు అధికార పక్షం, మొత్తం ప్రతిపక్షం ఏకమయ్యాయి. విభజనకు అనుకూలంగా ఓటేశాయి. పార్లమెంటు వేదికగా ఆనాడు ప్రత్యేక హోదాకు అన్ని పక్షాలు హామీ ఇచ్చాయి. ఇవాళ అవే పక్షాలు మాట తప్పుతున్నాయి. అలాంటపుడు ఇక పార్లమెంటుకు విశ్వసనీయత ఎక్కడుంటుంది? మేం అడుగుతున్న మౌలికమైన ప్రశ్న ఇది.  రాష్ర్టవిభజనతో హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోతోంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచే 60శాతం ఆదాయం వస్తుంది. 95శాతానికి పైగా సాఫ్ట్‌వేర్ సంస్థలు, 70శాతానికి పైగా మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వాటిలో ఉపాథి అవకాశాలు కూడా కోల్పోయాం. వీటన్నిటినీ కోల్పోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అయితే ఇపుడు దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఇపుడు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారు. 

ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమ‌రణ దీక్ష చేప‌ట్టారు. వీరితో పాటు టీడీపీకి చెందిన ఎంపీలు కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి దీక్ష‌లో కూర్చొని ఉంటే కేంద్రం దిగివ‌చ్చేద‌న్నారు. చంద్ర‌బాబు ఆ ప‌ని చేయ‌కుండా ప్ర‌జాధ‌నంతో ఇప్పుడు దొంగ దీక్ష‌లు చేయ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్నారు. ప్ర‌త్యేక హోదా సాధించి తీరుతామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ విద్యార్థుల‌కు హామీ ఇచ్చారు. 
Back to Top