<p style="" mso-margin-top-alt:auto="">హైదరాబాద్) ప్రత్యేకహోదా మీద ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నిర్వహించిన ముఖాముఖి పూర్తిగా విజయవంతం అయింది. వినూత్నంగా ఖండాంతరాల్లోని ప్రవాసాంధ్రుల్ని ఉద్దేశించి వైయస్ జగన్ నేరుగా మాట్లాడారు. అమెరికాలోని వివిధ నగరాలు, ఐరోపాలోని వివిద ప్రాంతాల్లోని తెలుగు వారు ఆయా కేంద్రాల్లో చర్చలో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లోని తెలుగువారు అడిగే ప్రశ్నలకు వైయస్ జగన్ నేరుగా జవాబులు ఇచ్చారు. ప్రత్యేక హోదా అవసరంమీద చైతన్యపరిచారు. అంతా కలిసికట్టుగా పోరాడుదామని పిలుపు ఇచ్చారు. ఈ రకమైన ముఖాముఖి పట్ల ప్రవాసాంధ్రులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. </p>