వైఎస్సార్ జిల్లాః ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా జిల్లాలో వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇవాళ మూడో రోజు పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ పులివెందులలో పార్టీ నేత పెళ్లూరి ఈశ్వర్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. మహేశ్వర్ రెడ్డి, పరిమళాదేవిలను జననేత ఆశీర్వదించారు. <br/>ఆతర్వాత అక్కడి నుంచి వైఎస్ జగన్ తొండూరుకు చేరుకున్నారు. స్థానికంగా వైఎస్సార్సీపీ కార్యకర్త గంగరాజు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం భద్రంపల్లికి చేరుకున్నారు. ఇటీవల బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు అరుణ్ కాంత్ రెడ్డి, చెన్నకేశవరెడ్డి, రామ్మెహన్ రెడ్డి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ పరామర్శించి వారిని ఓదార్చారు. <br/>అక్కడి నుంచి జమ్మలమడుగుకు చేరుకున్న వైఎస్ జగన్ కు ఘనస్వాగతం లభించింది. అడుగడుగునా కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ప్రతిపక్ష నేతపై కార్యకర్తలు పూలవాన కురిపించారు.