పాస్ బుక్ లు తప్పనిసరి..!

హైదరాబాద్) రైతులకు యాజమాన్యపు హక్కులు కల్పించే పాస్ బుక్ లు తప్పనిసరిగా
ఉంచాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం పాస్ బుక్ లను
తొలగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందని, ఇది సరైన చర్య కాదని ఆయన
వివరించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా రెవిన్యూ శాఖ మీద
ప్రశ్నల్లో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడారు.

       ఈ పుస్తకాలు తెస్తున్నాం,
కంప్యూటర్ రికార్డులు తెస్తున్నాం అని చెబుతున్నారని, కానీ పాస్ బుక్ లు లేకుండా
చేస్తాం అన్నది మాత్రం సరికాదని వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. ‘‘ ఈ పుస్తకాలు
కానీ, కంప్యూటర్లు కానీ రెవిన్యూ శాఖ చేతిలోనే ఉంటాయి. రెవిన్యూ శాఖలోని అధికారులు
ఎవరితో అయనా కుమ్మక్కు అయినా, లేదా మొత్తం సర్వర్ హ్యాక్ అయినా చాలా ఇబ్బంది. రెవిన్యూ
రికార్డులు మార్చేస్తే అసలు ఓనర్ ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లోకి వ్యవస్థ
వెళ్లిపోతుంది.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

       అందుచేత పాస్ బుక్ అనేది
కచ్చితంగా ఉండాలని వైఎస్ జగన్ విన్నవించారు. ‘‘పాస్ బుక్ అనేది కచ్చితంగాఉంటే రైతు
అనేవాడు దాన్ని చూపించి, కనీసం రికార్డుల్లో తప్పులు తలెత్తినప్పుడు
సరిచేయించుకోవడానికి, ఒత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉంటుంది. రికార్డులు తీసుకొని
అవసరమైతే కోర్టులకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.’’ అని వైఎస్ జగన్ అన్నారు.
అందుచేత పాస్ బుక్ లను ప్రాథమిక ఆధారాలు గా ఉంచాలని, సెకండరీ వ్యవస్థలుగా ఈ పాస్
బుక్ లను, కంప్యూటర్ రికార్డులను ఉంచుకోవాలని కోరారు.

Back to Top