శాస్త్రవేత్తలను అభినందించిన వైఎస్ జగన్

నెల్లూరు(శ్రీహరికోట) : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం నుంచి  ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ - 33  ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. నిర్దేశించిన సమయంలోనే పీఎస్ఎల్వీ సీ-33 కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో షార్లోని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో వైఎస్ జగన్ సైటింస్ట్ లను అభినందించారు. ప్రయోగ విజయవంతంలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని కొనియాడారు. 

ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉప గ్రహ ప్రయోగాలలో ఇది ఆఖరుది. సొంత నావిగేషన్ వ్యవస్థ కోసం ఇప్పటికే ఆరు ఉపగ్రహాలను ఇస్రో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.  ఐఆర్ఎన్ఎస్ఎస్ నుంచి రెండు రకాల సేవలు పొందవచ్చు. స్టాండర్డ్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా అందరికీ సేవలు అందుతాయి. అలాగే నిర్దేశించిన వ్యక్తులు, వ్యవస్థలకు గోప్యంగా సమాచారం అందిస్తుంది. విమానాలు, నౌకలకు ఐఆర్ఎన్ఎస్ఎస్ దిశానిర్దేశం చేయనుంది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి నిర్దిష్ట సమాచారం అందిస్తుంది. ఈ రాకెట్ 12 ఏళ్ల పాటు సేవలందించనుంది.


Back to Top