హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా జరుపుకున్నారు. కెనడా దేశం టోరెంటోలో వైయస్‌ఆర్ సీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కేక్‌కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. వైయస్ జగన్ సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఆస్టిన్‌లో..ప్రతిపక్షనేత వైయస్ జగన్ జన్మదిన వేడుకలను అమెరికాలోని ఆస్టిన్‌లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ వింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జై జగన్.. జోహార్ వైయస్‌ఆర్ అంటూ నినదించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైయస్ జగన్ సీఎం కావాలన్నారు. వైయస్‌ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నాడని మండిపడ్డారు.