తెలుగు రాష్ట్రాల్లో ఘ‌నంగా వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు

 

 హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాజన్న తనయుడి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

బంజారాహిల్స్‌లోని వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద గురజాల వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి వేడుకలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి యువత సంబరాలు చేసుకున్నారు. వందలాదిగా తరలివచ్చిన యువకులు జై జగన్‌.. పొలిటికల్‌ సూపర్‌స్టార్‌ అంటూ నినాదాలు చేశారు.

చిత్తూరులో..

వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఐరాల మండల కన్వీనర్ బుజ్జిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చిత్తూరులోని అమ్మఒడి ఆశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి అల్పాహార వితరణ చేశారు. మైనారిటీ నాయకుడు అను అల్తాఫ్, రాకేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు వేడుకలు చేసుకున్నారు.

వారాహి యాగం..
వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళంలోని దుర్గా మహాలక్ష్మి దేవాలయంలో వారాహి యాగం నిర్వహించారు. ఈ కార్యక్రంమలో సి.ఇ.సి. మెంబర్ అందవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం.వి.పద్మావతి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా
జిల్లాలోని కాళ్ల ఆస్పత్రిలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సంధర్భంగా రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఉండి నియోజకవర్గం సమన్వయకర్త పీవీఎల్‌ నరసింహరాజు కేక్‌ కట్ చేశారు. కార్యక్రంమలో పాతపాటి సర్రాజు, జిల్లా యూత్ అధ్యక్షుడు యోగేంద్ర బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్‌ జన్మదినం సందర్భంగా గణపవరం కన్యకాపరమేశ్వరి వర్తకసంఘ భవనంలో ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు.

తణుకులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అర్ధరాత్రి 12 గంటల నుంచే జననేత జగన్‌ పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి తణుకు కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరావు కేక్‌ కట్‌ చేశారు. వైఎస్‌ జగన్ తుదపరి పుట్టినరోజు ముఖ్యమంత్రి హోదాలో జరుపుకొంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ సీఎం కావాలన్నదే ఆంధ్రా ప్రజల అభిలాష అని వ్యాఖ్యానించారు.

వైఎస్‌ జగన్ జన్మదినం నరసాపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్‌రాజు, నియోజకవర్గ యూత్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాలకొల్లులోని గాంధీ బొమ్మల సెంటర్లో  వైస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పేదలకు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. పాలకొల్లు, పోడూరు, యలమంచిలి మండలాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.

ఇండస్ట్రీయల్  ఎస్టేట్ పార్కులో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు జరిగాయి.  విశాఖ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో వాకర్లకు బూట్లు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు ఎంవీవీ సత్యనారాయణ, చల్లా ఈశ్వర రావు, రత్నాకర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Back to Top