ఏపీ అసెంబ్లీ మూడో రోజు దద్దరిల్లింది. ప్రజాసమస్యలపై చర్చకు అడ్డుపడుతూ ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా 9 రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారని.. ఇప్పుడు కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, అలాంటి మనిషిని అరెస్టు చేస్తారా అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రశ్నించారు. సభ వాయిదా పడి, తిరిగి సమావేశమైన తర్వాత ఆయన మాట్లడారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని, రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఇది తప్పు సంప్రదాయమని స్పష్టం చేశారు. ఆయన ఏమన్నారంటే...<br/>కరణం బలరాం వ్యవహారానికి, రోజా సస్పెన్షన్‌కు సంబంధం ఏంటి?బలరాం విషయంలో నిబంధనలన్నీ పాటించారు. ఆయన నేరుగా స్పీకర్‌ను దూషించారుపైగా దాన్ని ప్రివిలేజి కమిటీకి రిఫర్ చేశారు, ఆ సందర్భంగా జరిపిన విచారణకు ఆయన హాజరు కాలేదుఆ తర్వాత మాత్రమే ఆయనను సస్పెండ్ చేశారుఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే ఒక్కరు వస్తుంటే పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు తిట్టారురోజా సస్పెన్షన్‌ను ఉపసంహరించకపోతే మేమంతా సస్పెండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాంసభలో స్పీకర్ సమక్షంలోనే మా ఎమ్మెల్యేల్ని తిట్టినా పట్టించుకోరాఎథిక్స్, ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయకుండా ఎలా సస్పెండ్ చేస్తారుప్రతి రోజూ సభ జరగకుండా ఉండాలనే యనమల చూస్తున్నారుఎజెండాలో లేకపోయినా అంబేద్కర్ అంశాన్ని తెరమీదకు తెచ్చారుఇప్పుడు కూడా రోజాను ఏడాది సస్పెండ్ చేసి, ఇక సభను నడవనివ్వకూడదని చేస్తున్నారుమేం ఎటూ నిరసన వ్యక్తం చేస్తామని ఆయనకు తెలుసుసెక్స్ రాకెట్ అంశాన్ని అసలు చర్చించనివ్వకుండా ఈ అంశాన్ని లేవనెత్తారుసభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మాది మాత్రమేదుర్మార్గపు ఆలోచనతోనే రోజాను సస్పెండ్ చేశారు.స్పీకర్‌కు ఇదే విషయాలు చెబుతూ రూల్ 340 ప్రకారం ఎమ్మెల్యేను ఏడాదిపాటు ఇష్టం వచ్చినట్లు సస్పెండ్ చేసే అధికారం లేదని చెప్పాముఅసెంబ్లీ ఆ సమావేశాలు కొనసాగినంత కాలం మాత్రమే సస్పెండ్ చేయాలని ఉందిఅదే రూల్స్ వినిపించినా, మాది అరణ్య రోదనే అయిందిమేం ఏంచెబితే అదే రూల్ అన్నట్లు అధికారపక్షం తయారైందిరోజుకో కాంట్రవర్సీ తెచ్చి ప్రజాసమస్యల మీద చర్చ జరగకూడదన్నట్లు పాలకపక్షం వ్యవహరిస్తోందితొలుత అంబేద్కర్‌ను తీసుకొచ్చారు.ముందు మేం సెక్స్ రాకెట్ మీద వాయిదా తీర్మానం ఇస్తే.. పట్టించుకోలేదుఎలాంటి సందర్భం లేకపోయినా రెండోసారి సభ వాయిదా పడిన తర్వాత అంబేద్కర్ అంశాన్ని తీసుకొచ్చారు.కావాలనే వివాదం సృష్టించారు..అధికారంలో ఉన్నవాళ్లు తమకు నచ్చనివాళ్లను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం మొదలుపెడితే శాసనసభమీద ప్రజలకున్న విశ్వాసం పోతుంది.అసెంబ్లీలో ఇప్పుడున్నది రెండే పార్టీలుబీజేపీవాళ్లు సగం టీడీపీ కండువాలు కప్పుకొన్నారుప్రతిపక్షం అంటే ప్రజల గొంతు.. దీన్ని నొక్కేస్తున్నారుఇలా చేస్తే ప్రజలు నష్టపోతారన్నది వీళ్లకు అర్థం కావట్లేదుదేవుడు, ప్రజలు మొట్టికాయలు వేస్తారునా దగ్గర బలం ఉంటే స్పీకర్ మీద అవిశ్వాసం మూవ్ చేసేవాళ్లంమా ఖర్మ ఏమిటంటే.. మేం ఏదైనా అవిశ్వాసం మూవ్ చేసినా అది నిలబడదు కాబట్టి ఊరుకుంటున్నాంకచ్చితంగా దీనిమీద పోరాడతాం, రూలింగ్ మీద కోర్టుకు కూడా పోతాం<br/>అలాంటిది ప్రతిపక్షానికి వాయిస్ ఇవ్వకుండా, సభ్యులను సస్పెండ్ చేసుకుంటూ పోతే ఇక సభ ఎలా జరుపుతారు?అయితే రోజా సస్పెన్షన్ విషయంలో తమకు మరో ఆలోచన లేదని, అవసరమైతే ప్రతిపక్ష సభ్యులందర్నీ సస్పెండే చేస్తామంటూ అధికారగర్వం ప్రదర్శించారు. మేం ఏది చెబితే అదే రూల్స్ అంటూ యనమల రెచ్చిపోయారు. ప్రజాసమస్యలపై చర్చను తప్పుదోవ పట్టించి మొక్కుబడిగా కొన్ని బిల్లులు తీసుకొచ్చి వాళ్లకు వాళ్లు చదివేసుకున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అయితే, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా నిరసనల మధ్యే బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఇతర మంత్రులు వాటన్నింటినీ మూజువాణీ ఓటుతో ఆమోదిస్తున్నట్లు స్పీకర్ చేత ప్రకటించేసుకున్నారు.