ప్లీనరీ తీర్మాణాలు, నిర్వాహణపై చర్చ

  • విజయవాడ కేంద్రంగా జులై 8, 9న రాష్ట్ర స్థాయి ప్లీనరీ
  • కీలక నేతలతో వైయస్ జగన్ భేటీ
హైదరాబాద్‌: దివంగత మహానేత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ముఖ్యనేతలతో కలిసి లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. విజయవాడ కేంద్రంగా జులై 8, 9వ తేదీల్లో రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ ఇప్పటికే మూడు దశల్లో ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు పూర్తి కాగా.. ఈ వారం రోజుల్లో జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు పూర్తకానున్నాయి. రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు ప్రధానంగా మూడు అంశాలపై జరగనున్నట్లుగా తెలుస్తోంది. 

 ప్రభుత్వ వైఫల్యాలు, హామీల విషయంలో చంద్రబాబు సర్కార్‌ విధానం, పార్టీ బలోపేతంపై చర్చించినున్నారు. ప్లీనరీలో ఏఏ అంశాలను అజెండాగా తీసుకోవాలనే దానిపై వైయస్‌ జగన్‌ పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. ఈ ప్లీనరీ సమావేశానికి 15 వేల మంది నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు వైయస్‌ జగన్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్ర స్థాయి ప్లీనరీ కమిటీల నియామకం భేటీ అనంతరం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

Back to Top