జగనే నిజం..సత్యమేవ జయతే

– ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో పోరాడింది ఎవరు?
– అలుపెరగని పోరాటం చేస్తోంది ఎవరు?
– రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా అని తలపడుతున్నదెవరు?
 
ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదన్నారు. బాబు గారు తలూపారు. ప్యాకేజీ పడేస్తామంటే అసెంబ్లీ సాక్షిగా స్వాగతించారు. ఆయన మాటల్లోనే..‘‘ ప్రత్యేక హోదాను 14వ ఆర్థిక సంఘం తిరస్కరించడం, అది ఇక రాబోయే రోజుల్లో ఏ రాష్ట్రానికి ఉండదు అనే విధంగా అవార్డు ఇవ్వడం. మీకు ప్రత్యేక హోదాలో ఇచ్చేవన్నీ కూడా ప్రత్యేక ప్యాకేజీలో ఇస్తామని చెప్పిన తరువాత ఒక విజ్ఞత ఉండే రాజకీయ నాయకుడిగా, అనుభవం ఉండే రాజకీయ వేత్తగా,  ఒక ముఖ్యమంత్రిగా నేను నిర్ణయం చేశాను. కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంది. అది మీరు జీర్ణించుకోలేక పోతున్నారు. మరోసారి ఈ సభ ద్వారా ఏపీ ప్రజానీకం కేంద్రానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తోంది’’. ఈ మాటలు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో మే, 9, 2015న ప్రకటన చేశారు.  

అదే రోజున ప్రతిపక్ష నాయకుడిగా వైయస్‌ జగన్‌ బాబు గారి ప్రసంగాన్ని తప్పుపడుతూ అసలు నిజం సాక్ష్యాధారాలతో సహా వివరించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్‌ జగన్‌ మాటల్లోనే.. ‘‘14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు నో చెప్పింది. అందుకే  ఇవ్వలేని పరిస్థితి ఉందని చంద్రబాబు మళ్లీ గ్లోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్‌సేన్, మరో సభ్యుడు గోవిందరావు , చైర్మన్‌ వైవీ రెడ్డి రాతపూర్వకంగా ఇచ్చారు. డిడ్‌నాట్‌ రెకమెండ్‌ ఆబాలిషన్‌ ఆఫ్‌ స్పేషల్‌ స్టేటస్‌ అని ఏకంగా 14వ ఆర్థిక సంఘం సభ్యుడు లేఖ  ఇచ్చారు’’. 

– చదువు అన్నది 2 ఇంటు 2 ఫోర్‌ అంటే ఫోరే అవుతుంది. అది ఎవరు చెప్పిన అంతే. ఈ మెటిరీయల్‌ అంతా కూడా మన అవగాహన కోసం ఇచ్చారు. గుజరాత్‌ నుంచి తెచ్చిన లా ఒపినియన్‌ కూడా చదవండి. అది కూడా వీరేంద్రసింగ్‌ ఠాగూర్‌ రాసిన కాపీలు కూడా ఇస్తాను. సెకండ్‌ ఒపీనియన్‌గా తీసుకొండి. అక్కడ మిమ్మల్ని బోల్తా కొట్టించే కార్యక్రమం జరుగుతుంది. అక్కడి నుంచి బయటపడి రాష్ట్రం కోసం పోరాటం చేసే కార్యక్రమాలు చేయండి’’. ఇది సీనియర్‌ చంద్రబాబుకు జగన్‌ ఇచ్చిన అమూల్యమైన సలహా, హెచ్చరిక కూడా. మూడేళ్ల క్రితం వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో చెప్పిన మాటల్నీ ఇవాళ తూచ తప్పకుండా..అక్షరం ముక్కా తేడా రాకుండా  టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ పార్లమెంట్‌లో ప్రస్తావించారు.జగన్‌ చెప్పింది టీడీపీకి దారి చూపిందన్నమాట..విషాదం ఏంటంటే  మూడేళ్ల తరువాత కళ్లు తెరవడం.  

ఇవాళ పార్లమెంట్‌లో గల్ల జయదేవ్‌ ఏమన్నారంటే..‘‘14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెప్పింది. ఒకే ఒక్క మాటతో అదంతా అబద్ధమని తేలిపోయింది. ఆర్థిక సంఘానికి సంబంధించిన ఇద్దరు సభ్యులు అభిజిత్‌సేన్, గోవిందరావు ప్రత్యేక హోదా ఇవ్వవద్దని కేంద్రానికి రెకమెండ్‌ చేయలేదన్నారు. 14వ ఆర్థిక సంఘం చైర్మన్‌ వైవీ రెడ్డి కూడా ఇదే విషయాన్ని లిఖితపూర్వంగా తెలియజేశారు’’ అని. మొత్తానికి టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాల కన్నా..స్వప్రయోజనాలే మిన్నగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం అన్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయని, ఏపీ ప్రజలంతా ప్రత్యేక హోదా కోరుకుంటున్నారని, బీజేపీ గ్రాఫ్‌ పడిపోతుందని గ్రహించిన చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని ప్రత్యేక హోదాను భుజాన వేసుకుని తానే పోరాటం చేస్తునట్లు నాటకాలు మొదలు పెట్టారు. ఎవరెన్ని చెప్పినా వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదా సాధనకు చేసిన పోరాటం వృథా కాదని, సత్యమేవ జయతే అన్నది అక్షర సత్యం. 
 
Back to Top