మీలో ఒక్కడిని

 
–  తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించిన ప్రజా సంకల్ప యాత్ర
–  జననేతను కలిసిన ఉల్లి రైతులు, మహిళ కూలీలు

అనంతపురం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే వైయస్‌ఆర్‌ జిల్లా, కర్నూలు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసిన వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ నెల 4వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టారు. మొదటి రోజు గుంతకల్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు, కూలీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాంట్రాక్ట్‌ కార్మికులు, మోడల్‌ స్కూల్‌ టీచర్స్, మున్సిపల్‌ కార్మికులు ఇలా అన్ని సామాజిక వర్గాల ప్రజలు, రాయలసీమ విమోచన సమితి, గిరిజన సంఘాల నేతలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఆయా గ్రామాల్లో మంచినీరు అందడం లేదని వైయస్‌ జగన్‌కు  ఫిర్యాదుకు చేశారు. ప్రజలతో జననేత మమేకమవుతూ వారి సమస్యలు లె లుసుకుంటున్నారు. మంగళవారం ఉదయం గుత్తిలో స్థానికులు ఇచ్చిన టీ తాగుతూ, బన్‌ బిస్కెట్‌ తింటూ వారిలో ఒక్కడిగా కలిసిపో యారు. రాజన్న బిడ్డ తమతో కలిసి పోవడం స్థానికులు సంబరపడుతున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు తల్లులు తమ పసిపిల్లలను వైయస్‌ జగన్‌వద్దకు తీసుకొని వచ్చి పేర్లు పెట్టాలని కోరడంతో వారిని ఎత్తుకొని వైయస్‌ జగన్‌ లాలించి వైయస్‌ విజయమ్మ పేరును ఆ బిడ్డలకు పెట్టారు. అలాగే ఊరు వాడా తరలివచ్చి వైయస్‌ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అవులంపల్లె క్రాస్‌ వద్ద వైయస్‌ జగన్‌ స్థానికులతో మమేకమై వారి సమస్యలు లె లుసుకున్నారు. అందరికి తోడుగా ఉంటానని జననేత మాట ఇచ్చారు.

ఉల్లి రైతుల సమస్యలు వింటూ..
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఉల్లిరైతులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఉల్లి నార ధరలు పెరిగాయి. మందులు కొనుగోలు చేయడం కష్టంగా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని, లక్ష పెట్టుబడి పెడితే రూ.25 వేలు కూడా రావడం లేదని తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని వైయస్‌ జగన్‌ను కోరారు. సాగు నీరు అందడం లేదని, చెరువులు ఎండిపోతున్నాయని తెలిపారు. గుత్తి పెద్ద చెరువుకు నీరు లేని పరిస్థితి నెలకొందన్నారు. ఉల్లి రైతులను ఆదుకోవాలని వైయస్‌ జగన్‌ను కోరారు.

కూలి గిట్టుబాటు కావడం లేదు
వ్యవసాయ కూలీలు మార్గమధ్యలో వైయస్‌ జగన్‌ను కలిశారు. తమకు దినసరి కూలి గిట్టడం లేదని, పది కిలోమీటర్ల దూరం వెళ్లి పని చేస్తే రోజుకు వంద రూపాయలు కూడా రావడం లేదని ఆందోళన వ్యక్తం చేవారు. మార్కెట్లో టమోటాలు, ఉల్లిపాయలు కూడా కొనుక్కోలేకపోతున్నామని ఫిర్యాదు చేశారు. ఉపాధి పనులు కల్పించడం లేదని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందడం లేదని కూలీలు పేర్కొన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని తెలిపారు. అప్పులు చేశాం, బ్యాంకులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని వాపోయారు.

తాడిపత్రి నియోజకవర్గంలో ఘన స్వాగతం
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి పార్టీ నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అవులంపల్లె క్రాస్‌ నుంచి పెద్దవడుగూరు మండలంలోకి వైయస్‌ జగన్‌ పాదయాత్ర అడుగుపెట్టడంతో స్థానికులు ఆత్మీయ స్వాగతం పలికారు. 
 
Back to Top