వెదిరేశ్వరం నుంచి 191వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

తూర్పు గోదావ‌రి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు  వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 191వ రోజు ప్రారం‍భమైంది. ఆదివారం ఉదయం వెదిరేశ్వరం ఎంపీపీ స్కూల్‌ నుంచి  ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని వైయ‌స్‌ జగన్ శనివారం పాదయాత్రకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. స్వల్ప విరామం అనంతరం జ‌న‌నేత‌ పాదయాత్రను పునఃప్రారంభించారు. కేతరాజుపల్లి, దేవరపల్లి, ఈతకోట, పలివెలక్రాస్‌, గంటిపల్లిపాలెం క్రాస్‌ మీదుగా గంటి వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది.  
Back to Top