ఘనంగా ఎంపీ అవినాష్‌రెడ్డి జన్మదిన వేడుకలు

పులివెందుల: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి 32వ జన్మదిన వేడుకలను పులివెందులలో గురువారం ఘనంగా నిర్వహించారు. పలు కార్యాలయాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజలకు మంచి పాలన అందిస్తూ నిండు నూరేళ్లు వర్థిల్లాలని వారు ఆకాం క్షిం చారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్ హేమలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను వైఎస్ జగన్ వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ కట్ చేశారు.

పాత ఎమ్మె ల్యే ఆఫీసులో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రసూల్ సాహెబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కేక్ ను వైఎస్ఆర్సీపీ నేత, మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి కట్ చేశారు. వైఎస్ఆర్ టీఎఫ్ కార్యాలయంలో జిల్లా సంయుక్త కార్యదర్శి వీరభద్రారెడ్డి, కసనూరు పరమేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి వెంకటనాథరెడ్డి ఆధ్వర్యంలో పది కిలోల కేక్ ను వైఎస్ఆర్ సీపీ నేత వైఎస్ మనోహర్రెడ్డి కట్ చేశారు.
Back to Top