జాబ్‌ రావాలంటే వైయస్‌ జగన్‌ రావాలి


తూర్పు గోదావరి: జాబ్‌ రావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని తూర్పు గోదావరి యువత నినదించారు. ప్రజా సంకల్ప యాత్ర 230వ రోజు పాదయాత్రలో యువకులు పాల్గొని వైయస్‌ జగన్‌కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ..ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదంటే రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడ్డారు. బాబు వచ్చాక ఆయన  కొడుకు లోకేష్‌కు మాత్రమే జాబ్‌ వచ్చిందన్నారు. ఇక చంద్రబాబును నమ్మమని, నిష్పక్షపాతంగా వ్యవహరించే వైయస్‌ జగన్‌ వైఖరి బాగా నచ్చిందని, ఆయన వస్తేనే జాబులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసి పది మందికి ఉద్యోగాలు ఇస్తామని వైయస్‌ జగన్‌ ప్రకటించడం సంతోషకరమన్నారు. జగన్‌ సీఎం అయితే యువ రాజ్యం సాధ్యమవుతుందని, ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అని చెప్పారు. 
 
Back to Top