దొడ్డిదారిన పచ్చచొక్కాల పాలన

కనగానపల్లె ఎంపీపీ ఉపఎన్నికలో టీడీపీ అధికార దుర్వినియోగం
వైయస్సార్సీపీ ఎంపీటీసీలను బెదిరించి ప్రలోభపెట్టిన మంత్రి పరిటాల సునీత
మీడియాపై ఆంక్షలు...వైయస్సార్సీపీ నేతలను అడ్డుకున్న ఖాకీలు
మంత్రి, పోలీసుల తీరుపై వైయస్సార్సీపీ నాయకుల ఆగ్రహం

అనంతపురంః  కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నిక విషయంలో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. మెజారిటీ లేకపోయినా అభ్యర్థిని నిలబెట్టడమే గాకుండా, మంత్రి పరిటాల సునీత వైయస్సార్సీపీ ఎంపీటీసీలను బెదిరించి ప్రలోభాలకు గురిచేసింది. పోలీసులు పచ్చచొక్కాలకు వంత పాడుతూ అత్యుత్సాహం ప్రదర్శించారు.  కవరరేజ్ చేయడానికి వెళ్లిన  ప్రముఖ మీడియా వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 8 కిలో మీటర్ల ముందే ఆ వాహనాన్ని ఎలా ఆపుతారంటూ ఎస్పీ రాజశేఖర్ బాబును వివరణ కోరేందుకు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నారు. మామిళ్ల పల్లి దగ్గర ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణను పోలీసులు అడ్డుకున్నారు.  రాప్తాడులో వైయస్ఆర్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై వైయస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఏపీ డీజీపీ సాంబశివరావుకు లేఖ కూడా రాశారు. అనంతపురం జిల్లా కనగానపల్లె ఎంపీపీ ఎన్నికల్లో అధికార పార్టీ టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి పార్టీ అధినేత జగన్‌ రాసిన లేఖను ఆయనకు అందజేశారు. కనగానపల్లె ఎంపీపీ ఎన్నికలను నిష్పాక్షికంగా జరుపాలని వారు ఎన్నికల కమిషనర్‌ను కోరారు. మంత్రి పరిటాల సునీత దౌర్జన్యానికి పాల్పడాలని చూస్తున్నారని, బలం లేకున్నా ఎంపీపీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టారని వైయస్సార్సీపీ నేతలు పార్థసారథి, తోపుదుర్తి కవిత, కన్నబాబు పేర్కొన్నారు.

2014లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కనగానపల్లి మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆరు స్థానాలను వైయస్‌ఆర్‌ సీపీ, ఐదు స్థానాలను టీడీపీ దక్కించుకున్నాయి. ఐతే, వైయస్‌ఆర్‌ సీపీకి చెందిన ఇద్దరిని ప్రలోభాలకు గురిచేసి టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఎలక్కుంట్ల ఎంపీటీసీ సభ్యుడు బిల్లే రాజేంద్రను ఎంపీపీ చేశారు. ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు.  అయితే బిల్లే రాజేంద్రను ఆ పదవిలో కొనసాగించడం ఇష్టంలేని పరిటాల వర్గీయులు ఇటీవల ఆయనపై ఒత్తిళ్లు తీసుకొచ్చి బలవంతంగా రాజీనామా చేయించారు.
 
తెరపైకి తమ సామాజిక వర్గానికి చెందిన ముత్తువకుంట్ల ఎంపీటీసీ సభ్యురాలు పద్మగీతను తీసుకొచ్చారు. బలహీన వర్గాలపై అణచివేతను నిరసిస్తూ రాజేంద్రతో పాటు వైస్‌ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, కనగానపల్లి ఎంపీటీసీ సభ్యురాలు బిల్లే గంగమ్మ టీడీపీ నుంచి బయటకొచ్చేశారు. తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైయస్ఆర్సీపీ ఏడుగురు ఎంపీటీసీలతో ముందంజలో ఉండగా, టీడీపీ నలుగురు ఎంపీటీసీలతో వెనకంజలో ఉంది. ఐతే చంద్రబాబు, మంత్రి పరిటాల సునీత ఎంపీపీ స్థానం కోసం అడ్డదారులు తొక్కారు.  వైయస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసి బెదిరించి దొడ్డిదారిన ఎంపీపీ స్థానాన్ని లాక్కున్నారు. 
Back to Top