యనమల సభ్యులను అవమానిస్తున్నారు

అసెంబ్లీః సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వకుండా....అడిగే సభ్యుడిని పట్టి సమాధానం ఇస్తామని మంత్రి యనమల మాట్లాడడంపై  వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. సీనియర్ అయి ఉండి యనమల ఆరకంగా మాట్లాడడం అందరినీ అవమానించడం కాదా అని నిలదీశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో పెట్టుబడుల పేరుతో ప్రభుత్వం చేస్తున్న మోసాలను శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు.   పెట్టుబడులు రాలేదు. నిరుద్యోగుల సంగతి దారుణంగా ఉందని తాము అసెంబ్లీలో ప్రస్తావిస్తే అడ్డుకుంటున్నామని మాట్లాడడం అధికార పార్టీకి తగదన్నారు. ఈవెంట్ మేనేజ్ మెంట్ లాగా సమ్మిట్ లు చేసి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని గడికోట విమర్శించారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలి,  అనవసర ఆర్భాట ఖర్చులకు పోవద్దని సూచిస్తే పాలకపక్షం సభ్యులు తమపై ఎదురుదాడి చేయడం సరికాదన్నారు.

తాజా వీడియోలు

Back to Top