యథా సీఎం తథా సండ్ర!

  • పదవి వదలని ఎమ్మెల్యే
  •  టీటీడీలో కళంకితుడా?
  • యథారాజా తథా
    ప్రజా అన్నది సామెత. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? ఇది
    కూడా సామెతే... ఈ రెండూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు సరిగ్గా సరిపోతాయి. ఓటుకు కోట్లు
    కేసులో ప్రత్యక్ష ప్రమేయంపై ఆరోపణలెదుర్కొంటున్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కుర్చీని
    గట్టిగా ఎలా పట్టుకుని కూర్చున్నాడో సండ్ర వెంకట వీరయ్య కూడా అలానే తన పదవిని పట్టుకుని
    వేలాడుతున్నాడు. దేశంలో ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే బాద్యత వహించి వెంటనే రైల్వే మంత్రి
    పదవిని త్యజించాడట లాల్ బహదూర్ శాస్త్రి. అంతటి నియమనిష్టలు ఇపుడు చంద్రబాబు వంటివారిలో
    కాగడా పెట్టి వెతికినా కనిపించవు. పదవి అంటే ఆయనకు అంత వ్యామోహం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో
    ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సాక్ష్యాలతో సహా దొరికిపోయిన కేసులో విచారణ జరుగుతున్నది
    కనుక కనీసం విచారణ పూర్తయ్యే వరకన్నా పీఠాన్ని వదలాలన్న ఇంగితం ఆయనకు లేకపోయింది. ఇక
    సండ్ర వెంకట వీరయ్య విషయానికొస్తే ఓటుకు కోట్లు కేసులో ఆయన అరెస్టయ్యాడు. కోర్టు ఆయనకు
    14రోజుల పాటు రిమాండ్ విధించింది. ఎమ్మెల్యేగా ఉన్న సండ్ర తిరుమల
    తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ధర్మ కర్తల మండలి సభ్యుడు కూడా. సండ్ర అరెస్టు కావడంతో
    టీటీడీలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. బోర్డు సభ్యుడిగా పదవి చేపట్టిన నెలన్నరలోనే
    అవినీతి ఆరోపణలతో సండ్ర అరెస్టయ్యారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉంటూ అరెస్టయిన తొలి
    వ్యక్తి సండ్ర వెంకట వీరయ్యేనట. ఆయన బోర్డు పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
    ఒకవేళ ఆయన గనుక రాజీనామా చేయకపోతే ఆయనను తొలగించాలని బోర్డు భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
    అసలు ఏసీబీ నుంచి నోటీసు అందుకున్న వెంటనే బాధ్యత వహించి సండ్ర పదవి నుంచి వైదొలగితే
    బాగుండేది. కానీ ఆయన తమ అధినేత బాటను ఎంచుకున్నారాయె. అనారోగ్యం పేరు చెప్పి పది రోజుల
    గడువు తీసుకున్న సండ్ర తొలుత రాజమండ్రిలో ఉన్నా ఆ తర్వాత తిరుమలలోనే తలదాచుకున్నారన్న
    ఊహాగానాలూ ఉన్నాయి. ఏది ఏమైనా ఎంతో పవిత్రమైన టీటీడీలో సండ్రవంటి కళంకితులను కొనసాగించడంపై
    సర్వత్రా విమర్శలు పెల్లుబుకుతున్నాయి.



Back to Top