యాంజాల్‌లో వైయస్‌ఆర్‌సిపి రక్తదాన శిబిరం

హైదరాబాద్‌, 17 డిసెంబర్‌ 2012: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ వైద్య విభాగం సోమవారంనాడు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా యంజాల్లో వై‌యస్‌ఆర్ ‌సిపి వైద్యుల అసోసియేషన్ అధ్యక్షుడు శివభరత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదానంతో పాటు ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ‌ ఈ రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం విజయమ్మ చేతుల మీదుగా పేదలకు చీరల పంపిణీ చేశారు.
Back to Top