నీరివ్వకుంటే టీడీపీకి పుట్టగతులు

 
 - జల సంక‌ల్ప యాత్ర‌కు రైతుల నుంచి విశేష స్పంద‌న‌

అనంతపురం : అనంత‌పురం జిల్లాకు నీరివ్వ‌కుంటే తెలుగు దేశం పార్టీకి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని, జిల్లావాసులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుణ‌పాఠం చెబుతార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర‌రెడ్డి హెచ్చ‌రించారు. నియోజకవర్గంలోని ఆయకట్టుకు హంద్రీ–నీవా నీరివ్వాలనే డిమాండ్‌తో తొమ్మిది రోజులు తలపెట్టిన ‘జల సంకల్పయాత్ర’ జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. రైతుల నుంచి విశ్వేశ్వ‌ర‌రెడ్డి పాద‌యాత్ర‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కారణమైన అనంత జిల్లాను పూర్తిగా విస్మరించారు. నీళ్లివ్వమంటే మోసపూరిత మాటలు చెప్తున్నారు.. మహానేత వైయ‌స్‌ పట్టుదలతో శ్రీశైలం నుంచి జీడిపల్లి రిజర్వాయర్‌కు నీళ్లొచ్చాయి.. టీడీపీ వాళ్లు ఒక అడుగు కూడా నీరు ఇవ్వలేకపోయారు  ఉరవకొండ నియోజవర్గానికి నీళ్లు ఎలా ఇవ్వరో చూస్తాం’ అని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాబు బండారం బ‌య‌ట పెడ‌తాం
చంద్రబాబు మోసపు మాటలు ఏవిధంగా ఉన్నాయో తెలియజేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నీరివ్వకుంటే వేలాది మంది రైతులతో పాదయాత్ర చేసి చంద్రబాబు బండారం బయట పెడతాం. వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు లేకుండా చేస్తాం. 2004లో సీఎం అయిన ఏడాదికే వైయ‌స్‌ ఉరవకొండకు వచ్చి హంద్రీ–నీవా పథకానికి శంకుస్థాపన చేసి జీడిపల్లి వరకు రూ. 2,300 కోట్లు ఖర్చు చేశారు. రెండోదశ కూడా దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు వచ్చే నాటికి  90 శాతం పనులు పూర్తయ్యాయి. నాలుగేళ్లలోనే వైయ‌స్‌ అంత గొప్ప పనులు చేస్తే చంద్రబాబు మాత్రం జీడిపల్లి నుంచి గుండ్లపల్లికి నీరు తీసుకురాలేకపోయారు. రాష్ట్రం విడిపోయిన నాటికి రూ. 90 వేల కోట్లు అప్పులుంటే ఈ మహానుభావుడు వచ్చిన నాలుగేళ్లలోనే  రూ.2.20 లక్షల కోట్లకు అప్పులు పెంచేశారని విమ‌ర్శించారు. 


Back to Top