ఎంపీ నిధులతో పనులు ప్రారంభం

కోవూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నిధుల నుంచి నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలోని వేగూరు గ్రామం వసంతపురం ప్రాంత అభివృద్ధికి రూ. 4.5 లక్షలు మంజూరయ్యాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత జెట్టి శ్యామ్‌ సుందర్‌రెడ్డి తెలిపారు. ఎంపీ నిధులతో శుక్రవారం సిమెంటు రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెట్టి శ్యామ్‌సుందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్దికి ఎంపీ నిధులు మంజూరుచేయడంలో కృషి చేసిన వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. ఎంపీ నిధులే  గ్రామ  పంచాయతీ నిధులు కూడా గ్రామాభివృద్దికి కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. 

Back to Top