బాబు జాబు ఎక్కడ

వైఎస్సార్ జిల్లాః చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థివిభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లాలో భారీ ర్యాలీ తీశారు. 
చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని చెప్పి ప్రజలను మోసగించారని విద్యార్థి నాయకులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడం దారుణమన్నారు. రుణమాఫీ, ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ కళ్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... చెప్పిన మాటల్లో ఏ ఒక్కటి నెరవేర్చడం లేదన్నారు. 

రైతులు, డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక విలవిలలాడుతున్నారని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని తేల్చిచెప్పారు. 
Back to Top