హామీలు నెరవేర్చేదెప్పుడో చెప్పాలి..?

బద్వేలు: టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఆర్భాట ప్రకటనలతో ప్రజలను మభ్య పెడుతుందని వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి  విమర్శించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ ఎంతవరకు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దశలవారీగా మాఫీ అంటూ రైతాంగాన్ని నిలువునా కూల్చారన్నారు. ఇంటికో ఉద్యోగమంటే ఉన్న ఉద్యోగులను పీకేయ్యడమా అని అన్నారు. నిరుద్యోగ భృతి పేరు చెబుతూన్నా ఆచరణలోకి ఎప్పుడు వస్తుందో తెలియదన్నారు. రాష్ట్రంలో రైతాంగం కరవుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా నివారణ చర్యలు తీసుకోలేదన్నారు. బ్రహ్మాంసాగర్‌లోని నీరును నియోజకవర్గంలోని చెరువులు నింపేందుకు విడుదల చేయాలని కోరారు. భూగర్భజలాలు భారీగా తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలున్నా పట్టించుకోకుండా ఆర్భాటంగా  మహానాడు నిర్వహించడమేంటని ప్రశ్నించారు.

31న నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం
వైయస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఈ నెల 31 పోరుమామిళ్లలోని వసుందర కళ్యాణ మండపంలో సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. సమావేశానికి నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లులతో పాటు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యనిర్వాహక సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆయన కోరారు. సమావేశంలో తెదేపా హామీలు, వాటి అమలలో విఫలమవ్వడంపై చర్చ నిర్వహిస్తామన్నారు. అలాగే భవిష్యత్తులో పార్టీ ముందుకు సాగేందుకు అవసరమైన వ్యుహా ప్రతివ్యుహాలను చర్చిస్తామన్నారు. సమావేశానికి ఎంపీ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ మంత్రి వైయస్‌వివేకానందరెడ్డి హాజరవుతారని గోవిందరెడ్డి తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top