వైయస్‌ జగన్‌ వల్లే రాష్ట్రానికి హోదా సాధ్యం


ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టింది చంద్రబాబే
బాబుకు దమ్ముంటే టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలి


పశ్చిమగోదావరి: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమని నరసాపురం, రాజమండ్రి పార్లమెంట్‌ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, కొయ్యే మోసేన్‌రాజు అన్నారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద వైయస్‌ఆర్‌ సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్‌ కన్వీనర్‌ కోటగిరి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత,పాతపాటి స్రరాజు, ఘంటా మురళి, నియోజకవర్గ కన్వీనర్లు గుణ్ణం నాగబాబు, కవురు శ్రీనివాస్, మధ్యాహ్నపు ఈశ్వరి, పివిఎల్‌ నరసింహరాజు,తలారి వెంకట్రావు, కొఠారు అబ్బాయి చౌదరి, పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, కొఠారు రామచంద్రరావు, దయాల నవీన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

తన స్వార్థప్రయోజనాల కోసం చంద్రబాబు ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఎమ్మెల్సీ ఆళ్ల నాని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. హోదా కోసం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. చంద్రబాబు లాంటి అసమర్థుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల దురదృష్టమన్నారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు వైయస్‌ఆర్‌ సీపీ సవాల్‌కు స్పందించాలన్నారు. హోదా సాధించాలనే పట్టుదల చంద్రబాబులో ఏ కోశన ఉన్నా వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలతో కలిసి టీడీపీ ఎంపీలను కూడా రాజీనామా చేయించగల దమ్ముందా అని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచుతామన్నారు. 
Back to Top