టీడీపీ నాలుగున్నరేళ్ల పాలన అట్టర్ ఫ్లాప్
దోచుకోని దాచుకోవడమే టీడీపీ అభివృద్ధి...వైయస్‌ఆర్‌సీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి..
విజయనగరంః జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర ఒక చ్రరిత అని నెల్లూరు జిల్లాకు చెందిన వైయస్‌ఆర్‌సీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట తప్పని వైయస్ జగన్‌ను ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు తీరాలని, రాష్ట్రం బాగుండాలనే సంకల్పతో జననేత చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఆనం,నేదురుమల్లి కుటుంబం వైయఆర్‌సీపీలోకి చేరడంతో నెల్లూరు జిల్లాలో పార్టీ మరింత బలోపేతమయ్యిందన్నారు. నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడానికి కృషి చేస్తామని తెలిపారు. చంద్రబాబు ఈ నాలుగున్నరేళ్ల పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, ప్రజలకు నమ్మించి ఓట్లు వేయించుకుని నేడు ప్రజలను గాలికొద్దిలేశారని విమర్శించారు. టీడీపీ పాలనలో తండ్రికొడుకులూ చేస్తోంది.. అభివృద్ధి కాదని, దోచుకోవడం..దాచుకోవడం అని విమర్శించారు.