ఆత్మగౌరవ యాత్ర‌కు విశేష స్పంద‌న‌

 విశాఖ పట్నం:  విశాఖ రైల్వే జోన్‌, ఏపీకి ప్రేత్యేక హోదా  ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ నేతృత్వంలో సాగుతున్న‌ ఆత్మగౌరవ యాత్రకు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. గ‌త నెల 30న అనకాపల్లి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర భీమిలి వరకు మొత్తం 12 రోజులపాటు కొనసాగనున్నది. బుధ‌వారం ఏడో రోజు తాటిచెట్ల పాలెంలో మొద‌లు కాగా గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్ర‌ధాని బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి అమ‌ర్‌నాథ్ పూల మాల వేసి పాదయాత్ర ప్రారంభించారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్ఫూర్తితో పాద‌యాత్ర చేప‌ట్టిన‌ట్లు అమ‌ర్‌నాథ్ తెలిపారు. ఈ యాత్ర‌కు ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన ప‌లువురు నాయ‌కులు స్వ‌చ్ఛందంగా మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

Back to Top