షర్మిల దృష్టికి చేనేత కుటుంబాల కష్టాలు

మరడాం (విజయనగరం జిల్లా),

17 జూలై 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు విజయనగరం జిల్లాలో విశేష ఆదరణ లభిస్తోంది. విజయగరం జిల్లాలోని మరడాం నుంచి ఆమె బుధవారం ఉదయం తన పాదయాత్రను ప్రారంభించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయతో నడిచేందుకు వైయస్ అభిమానులు ‌పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీమతి షర్మిలను చూసేందుకు, ఆమెకు తమ కష్టాలు చెప్పుకునేందుకు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు.

పాదయాత్ర ప్రారంభ సమయంలో మరడాం వద్ద పలు చేనేత కుటుంబాలు శ్రీమతి షర్మిలను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నాయి. చంద్రబాబు నాయుడి హయాంలో జనతా వస్త్రాల తయారీ ఆర్డర్ను నిలిపివేసిన తర్వాత చేనేత వృత్తికి‌ తామంతా పూర్తిగా దూరం కావాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సొసైటీని రద్దు చేయటంతో పాటు రాయితీలను కూడా నిలిపివేశారని వారు శ్రీమతి షర్మిలకు మొర పెట్టుకున్నారు.

శ్రీమతి షర్మిలను కలిసిన కూరగాయల రైతులు కూడా తమ కడగండ్లను వివరించారు. నీలం తుపాను ధాటికి పంటలు నష్టపోయిన తమకు ఇంతవరకూ పరిహారం అందలేదని వారు శ్రీమతి షర్మిలకు చెప్పుకుని విచారం వ్యక్తం చేశారు. తమ దగ్గర కూరగాయలు కేజీ 5 రూపాయల చొప్పున కొంటున్న దళారులు మార్కెట్‌లో 20 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పారు. వారి సమస్యలను శ్రద్ధ విన్న శ్రీమతి షర్మిల... వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జగనన్న అందరి‌కీ న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top