పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం

హైదరాబాద్ః  ఎప్పటికీ తాము వైఎస్సార్‌సీపీలోనే ఉంటామని, పార్టీ బలోపేతానికి కషి చేస్తామని సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి ఇన్‌చార్జి నీలం రమేశ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన కలుసుకొని  మాట్లాడారు.  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,  పాయం వెంకటేశ్వర్లు పార్టీనీ వీడడం దారుణమన్నారు, ఎవరూ వెళ్లినా తాము మాత్రం పార్టీలోనే ఉంటామని తెలిపారు.

సేవాదళ్‌ కార్యకర్తలంతా ప్రజల్లో ఉంటూ పార్టీ పటిష్టతకు కషి చేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ అమలు చేసిన పథకాలను గుర్తు చేస్తూ వైఎస్సార్‌సీపీని బలోపేతం చేస్తామని చెప్పారు. సేవాదళ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు

తాజా ఫోటోలు

Back to Top