విద్యాభివృధికి తమ వంతు కృషి చేస్తాం

సైకిల్‌ళ్లు పంపిణీ చేస్తున్న అధికారులు
మంత్రాలయం రూరల్‌: విద్యాభివృధికి తమ వంతు కృషి చేస్తామని వైయస్సార్‌సీపీ రాష్ట్రయూత్‌ కమిటీ సభ్యులు వై.ప్రదీప్‌రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రాలయం మండలం తుంగభద్ర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికలు బడికొస్తా కార్యక్రమంలో భాగంగా నూతనంగా మంజూరైన 47 సైకిలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యాబివృధికి తమ కృషి చేస్తామన్నారు. అంతే కాకుండా విద్యార్థులు, బాలికలు కష్టపడి చదివి చదువుకున్న పాఠశాలకు, తల్లితండ్రులకు , ఊరికి మంచి గుర్తింపు తీసుకుని రావాలన్నారు. అనంతరం ఆయన చేతుల మీదుగా బాలికలకు సైకిళ్లు అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కె.ఈరన్న, ప్రధానోపాద్యాయులు చౌడోజిరావు, సిబ్బంది గురురాజు, భీమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Back to Top