హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కుట్రపై న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయడమేనని గిడ్డి ఈశ్వరి అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై చాలా చాలా సంతోషంగా ఉందన్నారు. చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పిస్తామని చెప్పే చంద్రబాబు..అధికారపార్టీని నిలదీశారని కక్షపూరితంగా రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని ఈశ్వరి మండిపడ్డారు. ఈ కుట్రపై న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతాయని పేర్కొన్నారు.<br/>టీడీపీ ప్రభుత్వం తన హామీలు నెరవేర్చకపోగా, మహిళా ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేసి సస్పెండ్ చేసిందని దుయ్యబట్టారు. చివరకు ధర్మమే గెలిచిందని ఈశ్వరి చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే అనిత మాట్లాడుతున్న విషయాలు సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేలా ఉన్నాయని విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ నుంచి ఏ మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించినా, అటునుంచి మంత్రులకు బదులు అనిత లేచి మాట్లాడతారని చురక అంటించారు. రోజా విషయంలో మేం గర్వపడుతున్నాం. ఆమెలాంటి ధైర్యవంతురాలు మా పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని ఈశ్వరి అన్నారు.